భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఎండ తీవ్రత
తట్టుకోలేక జనం పిట్టల్లా రాలుతున్నారు. జిల్లాలో బుధవారం వడదెబ్బతో 12 మంది మృతిచెందారు. కురవి మండలంలోనే నలుగురు మృత్యువాత పడ్డారు.
మహబూబాబాద్ : మానుకోట పట్టణానికి చెందిన గోపు నర్సయ్య(89) రెండురోజుల క్రితం వదెబ్బకు గురయ్యాడు. కుటుంబసభ్యులు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా బుధవారం మృతిచెందాడు. మృతుడికి ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు.
డోర్నకల్ : మండలంలోని పెరుమాళ్లసంకీస గ్రామపంచాయతీ పరిదిలోని బొడ్రాయితండాకు చెందిన ఉపాధి కూలీ అజ్మీర వెంకన్న(46) వడదెబ్బతో బుధవారం మృతి చెందాడు. మంగళవారం ఉపాది పనులకు వెళ్లిన వెంకన్న వాంతులతో అస్వస్థతకు గురయ్యూడు, బుధవారం తెల్లవారుజామున ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు.
పరకాల : మండలంలోని మల్లక్కపేట గ్రామానికి చెందిన సంగెం మల్లయ్య(60) వడదెబ్బతో బుధవారం మృతి చెందారు. ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన మల్లయ్య ఎండవేడిమి భరించలేక అస్వస్థతకు గురయ్యూడు. ఇంటికి వచ్చాక ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందాడు.
మరిపెడ : మండల కేంద్రానికి చెందిన షేక్ జానీమియూ సోడాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యూడు. ఈ క్రమంలో బుధవారం మృతిచెందాడు. జానీమియూకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.
కురవి : మండలంలోని బలపాల గ్రామానికి చెందిన చిగురుపాటి రంగమ్మ(70) వడదెబ్బతో అస్వస్థతకు గురైంది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా బుధవారం మృతిచెందింది. అదే గ్రామ శివారు లింగ్యాతండాకు చెందిన బానోత్ నాజీ(65) తన కుమార్తెకు చెందిన గొర్రెలను కాసేది. అడవిలో ఎండ వేడి తట్టుకోలేక మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురైంది. తెల్లవారితే ఆస్పత్రికి తీసుకెళ్దామనుకుంటే అర్ధరాత్రే మృతి చెందిందని కుటుంబసభ్యులు తెలిపారు. అలాగే కురవికి చెందిన బత్తిని లింగమ్మ(69) అనే వృద్దురాలు వడదెబ్బతో బుధవారం మృతి చెందింది. రాజోలు గ్రామానికి చెందిన కొటూరి రాధమ్మ(65) వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై మృతి చెందింది.
కేసముద్రం : మండలంలోని ఇంటికన్నె గ్రామానికి చెందిన చెలగొల్ల కొమురయ్య(75) మంగళవారం చేను వద్దకు వెళ్లాడు, ఎండ తీవ్రతతో ఇంటికి రాగానే వాంతులు, విరేచనాలు అయ్యూరుు. కుటుంబసభ్యులు మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడికి భార్య ముత్తయ్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.
చెన్నారావుపేట : వుండలంలోని ఖాధర్‌పేట శివారులోని అడ్డబాట తండాకు చెందిన బోడ లక్ష్మి(50) తన ఇంటి వుుందున్న గోడలు లేని గుడిసెలో పడుకుంది. వేడి గాలులతో వడదెబ్బకు గురై వాంతులు, విరేచనాలు చేసుకుంది. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగానే వుృతి చెందింది.
జనగామ రూరల్ : మండలంలోని చౌడారం గ్రామానికి చెందిన రాచకొండ లక్ష్మి (56) రోజు వారి కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తోంది. మూడు రోజుల క్రితం వడదెబ్బకు గురై స్థానిక వైద్యుల వద్ద చికిత్స చేయించుకుంటూ బుధవారం మృతి చెందింది. లక్ష్మికి కుమారుడు రమేష్ ఉన్నాడు. మండలంలోని మరిగడి గ్రామానికి చెందిన కూరాకుల సోమయ్య (60) అనే రైతు గత మూడు రోజుల క్రితం పొలం పనులు చేస్తూ ఎండతో అస్వస్థతకు గురయ్యాడు. ఇంటి వద్ద, జనగామ ఆస్పత్రిలో వైద్య చికిత్సలు చేయిస్తుండగా బుధవారం మృతిచెందాడు.