The intensity of the sun
-
వడదెబ్బతో 12 మంది మృతి
భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఎండ తీవ్రత తట్టుకోలేక జనం పిట్టల్లా రాలుతున్నారు. జిల్లాలో బుధవారం వడదెబ్బతో 12 మంది మృతిచెందారు. కురవి మండలంలోనే నలుగురు మృత్యువాత పడ్డారు. మహబూబాబాద్ : మానుకోట పట్టణానికి చెందిన గోపు నర్సయ్య(89) రెండురోజుల క్రితం వదెబ్బకు గురయ్యాడు. కుటుంబసభ్యులు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా బుధవారం మృతిచెందాడు. మృతుడికి ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. డోర్నకల్ : మండలంలోని పెరుమాళ్లసంకీస గ్రామపంచాయతీ పరిదిలోని బొడ్రాయితండాకు చెందిన ఉపాధి కూలీ అజ్మీర వెంకన్న(46) వడదెబ్బతో బుధవారం మృతి చెందాడు. మంగళవారం ఉపాది పనులకు వెళ్లిన వెంకన్న వాంతులతో అస్వస్థతకు గురయ్యూడు, బుధవారం తెల్లవారుజామున ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. పరకాల : మండలంలోని మల్లక్కపేట గ్రామానికి చెందిన సంగెం మల్లయ్య(60) వడదెబ్బతో బుధవారం మృతి చెందారు. ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన మల్లయ్య ఎండవేడిమి భరించలేక అస్వస్థతకు గురయ్యూడు. ఇంటికి వచ్చాక ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందాడు. మరిపెడ : మండల కేంద్రానికి చెందిన షేక్ జానీమియూ సోడాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యూడు. ఈ క్రమంలో బుధవారం మృతిచెందాడు. జానీమియూకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కురవి : మండలంలోని బలపాల గ్రామానికి చెందిన చిగురుపాటి రంగమ్మ(70) వడదెబ్బతో అస్వస్థతకు గురైంది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా బుధవారం మృతిచెందింది. అదే గ్రామ శివారు లింగ్యాతండాకు చెందిన బానోత్ నాజీ(65) తన కుమార్తెకు చెందిన గొర్రెలను కాసేది. అడవిలో ఎండ వేడి తట్టుకోలేక మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురైంది. తెల్లవారితే ఆస్పత్రికి తీసుకెళ్దామనుకుంటే అర్ధరాత్రే మృతి చెందిందని కుటుంబసభ్యులు తెలిపారు. అలాగే కురవికి చెందిన బత్తిని లింగమ్మ(69) అనే వృద్దురాలు వడదెబ్బతో బుధవారం మృతి చెందింది. రాజోలు గ్రామానికి చెందిన కొటూరి రాధమ్మ(65) వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై మృతి చెందింది. కేసముద్రం : మండలంలోని ఇంటికన్నె గ్రామానికి చెందిన చెలగొల్ల కొమురయ్య(75) మంగళవారం చేను వద్దకు వెళ్లాడు, ఎండ తీవ్రతతో ఇంటికి రాగానే వాంతులు, విరేచనాలు అయ్యూరుు. కుటుంబసభ్యులు మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడికి భార్య ముత్తయ్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. చెన్నారావుపేట : వుండలంలోని ఖాధర్పేట శివారులోని అడ్డబాట తండాకు చెందిన బోడ లక్ష్మి(50) తన ఇంటి వుుందున్న గోడలు లేని గుడిసెలో పడుకుంది. వేడి గాలులతో వడదెబ్బకు గురై వాంతులు, విరేచనాలు చేసుకుంది. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగానే వుృతి చెందింది. జనగామ రూరల్ : మండలంలోని చౌడారం గ్రామానికి చెందిన రాచకొండ లక్ష్మి (56) రోజు వారి కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తోంది. మూడు రోజుల క్రితం వడదెబ్బకు గురై స్థానిక వైద్యుల వద్ద చికిత్స చేయించుకుంటూ బుధవారం మృతి చెందింది. లక్ష్మికి కుమారుడు రమేష్ ఉన్నాడు. మండలంలోని మరిగడి గ్రామానికి చెందిన కూరాకుల సోమయ్య (60) అనే రైతు గత మూడు రోజుల క్రితం పొలం పనులు చేస్తూ ఎండతో అస్వస్థతకు గురయ్యాడు. ఇంటి వద్ద, జనగామ ఆస్పత్రిలో వైద్య చికిత్సలు చేయిస్తుండగా బుధవారం మృతిచెందాడు. -
ఎండ @ 40.5
సిటీబ్యూరో: నగరంలో మండుటెండలు మళ్లీ ఠారెత్తిస్తున్నాయి. సోమవారం గరిష్టంగా 40.5 డిగ్రీలు,కనిష్టంగా 27.3 డిగ్రీలు,గాలిలో తేమ 28 శాతంగా నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లిన పలువురు మండుటెండకు సొమ్మసిల్లారు. మంగళవారం నుంచి రోహిణీ కార్తె మొదలవనున్న నేపథ్యంలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మధ్యాహ్నం వేళ ఇంటి నుంచి బయటికి వెళ్లేవారు గొడుగు, క్యాప్, చలువ కళ్లద్దాలు ధరించాలని సూచించింది. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. -
నగరాన... నిప్పుల వాన
రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు వడగాల్పులతో సిటీజనుల ఉక్కిరిబిక్కిరి నగరం నిప్పుల కుంపటిలా మారింది. భానుడి భగభగలతో విలవిల్లాడింది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు..వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రోడ్లపైకి వచ్చేందుకే భయపడ్డారు. మధ్యాహ్నం వేళలో రోడ్లన్నీ బోసిపోయి నగరంలో కర్ఫ్యూ వాతావరణం కన్పించింది. మంగళవారం అత్యధికంగా 41.8 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ సీజన్లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. కాగా ఎల్బీనగర్, తిరుమలగిరి, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయినట్లు ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న స్థానికులు తెలిపారు. పలువురు సెల్ఫోన్లు, థర్మామీటర్ల ఆధారంగా స్థానికంగా నమోదైన ఉష్ణోగ్రతలు తెలుసుకుంటున్నారు. -సాక్షి, సిటీబ్యూరో ఆరేళ్లలో ఇదే అత్యధికం... గ్రేటర్లో 2010 ఏప్రిల్ 16న 42.7 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. తాజాగా ఏప్రిల్ 3న 41.4 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకాగా..ఏప్రిల్ 12న(మంగళవారం) 41.8 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం. కాగా రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం 26.3 డిగ్రీలు నమోదవడంతో ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత అధికమవుతోంది. కాగా మే నెలలో ఈసారి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకునే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా గాలిలో తేమ 50 శాతం మేర ఉండాలి. కానీ 24 శాతానికి పడిపోవడంతో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి 8 తర్వాత కూడా వాతావరణం చల్లబడడం లేదు. దీంతో ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు పనిచేస్తున్నా..వేడిగాలులకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నామని వాపోతున్నారు. శరీ రంలో నీటి శాతాన్ని కోల్పోయి అతిసారం బారి నపడుతున్నామని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇక మండుటెండలకు మధ్యాహ్నం వేళల్లో జనం ఇళ్లకే పరిమితం కావడంతో ప్రధాన రహదారులు, ఫ్లైఓవర్లు బోసిపోయాయి. వాహనాల రాకపోకలు తగ్గి నగరంలో పలుచోట్ల కర్ఫ్యూ వాతావరణం తలపించింది. మధ్యాహ్నం వేళల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలకు గాలిలో తేమ 24 శాతానికి పడిపోయింది. వడగాల్పుల తీవ్రతకు వృద్ధులు, రోగులు సొమ్మసిల్లుతున్నారు. పలు ఆస్పత్రుల్లో వడదెబ్బ కేసులు క్రమంగా పెరుగుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే ఆరు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వడగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీచేసింది. వృద్ధులు, రోగులు ఎండ తీవ్రత బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కాగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. చర్మం, కళ్ల సంరక్షణపై శ్రద్ధ చూపాలని స్పష్టం చేస్తున్నారు. కొబ్బరి నీళ్లు, లస్సీ, మజ్జిగ, మంచినీరు, పండ్లరసాలను అధికంగా తీసుకొని అతిసారం బారి నుంచి రక్షణం పొందాలని, ఎండకు బయటికి వెళ్లే సమయంలో విధిగా గొడుగు తీసుకు వెళ్లాలని సూచిస్తున్నారు. పెంపుడు జంతువులు, పశువులు, పక్షులను కూడా వేసవి తాపం నుంచి రక్షించేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
వడ దడ
వెనక్కి తగ్గని భానుడు అదే ఉష్ణతీవ్రత నగరంలో 39.2 ఉష్ణోగ్రత విశాఖపట్నం : భానుడు వెనక్కి తగ్గడం లేదు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం లేదు. పైగా ఉష్ణతీవ్రతను కొనసాగిస్తున్నాడు. అకాల ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. అదే పనిగా వీస్తున్న వడగాడ్పులను తట్టుకోలేకపోతున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు చెవులకు రక్షణగా హెల్మెట్లు పెట్టుకున్నా, కాటన్ వస్త్రాలు కప్పుకున్నా ఉపశమనం కలగడం లేదు. కిలోమీటరు దూరం ప్రయాణించే సరికే ఏ చెట్టు నీడనో ఆశ్రయిస్తున్నారు. అంతకంటే ముందుకు వెళ్తే ఏమవుతామోనని ఆందోళన చెందుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేడి వెదజల్లుతూనే ఉండడంతో అట్టుడికిపోతున్నారు. రాత్రి చీకటి పడ్డాక కూడా వేడి ప్రభావం చూపుతోంది. ఆదివారం నగరంలో రికార్డు స్థాయిలో 39.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం కాస్త ఉపశమనం కలుగుతుందనుకుంటే అంతే స్థాయిలో 39.2 డిగ్రీలు రికార్డయింది. విశాఖలోని వాల్తేరు వాతావరణ నమోదు కేంద్రానికి, నగర శివారులోని ఎయిర్‌పోర్టులో నమోదు కేంద్రానికి ఉష్ణోగ్రతల్లో కనీసం మూడు నాలుగు డిగ్రీల వ్యత్యాసం ఉంటుంది. ఎయిర్‌పోర్టుకంటే వాల్తేరులోనే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. విశేషమేమిటంటే సోమవారం ఈ రెండు చోట్లా దాదాపు ఒకేలా (వాల్తేరులో 39.0, ఎయిర్‌పోర్టులో 39.2 డిగ్రీలు) ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అందుకే సోమవారం నగరంలో అత్యంత ఎండతీవ్రతను జనం చవిచూశారు. ఇలాంటి పరిస్థితి అత్యంత అరుదుగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరో రెండ్రోజుల వరకు ఇలాంటి వాతావరణమే కొనసాగుతుందన్న హెచ్చరికలతో నగర, జిల్లా వాసులు బెంబేలెత్తుతున్నారు. -
పిట్టలు రాలుతున్నాయ్..!
ఎండల తీవ్రతను తట్టుకోలేక పక్షుల మృతి {బీడింగ్, నెస్టింగ్ సీజన్ విహంగాలకు కష్టకాలం ఆహారం, నీరు దొరక్క వందల మైళ్లు వలసలు టపటపా రాలిపోతున్న గుడ్లగూబలు, కబోది పక్షులు విజయవాడ బ్యూరో: ఎండల తీవ్రత పక్షి జాతికి పెనుముప్పుగా మారుతోంది. వేసవి ధాటికి తట్టుకోలేక వివిధ రకాల పక్షులు నేల రాలుతున్నాయి. సరైన ఆవాసం, ఆహారం, నీరు లభించక వందల కిలోమీటర్లు వలస పోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలను తట్టుకోలేక గుడ్లగూబలు, కబోది పక్షులు, నైట్‌హెరాన్స్, నైట్‌జార్స్ పరిస్థితి దయనీయంగా మారింది. సాధారణంగా పక్షులు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు. పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల కంటే మించితే వీటికి ప్రాణగండం పొంచి ఉన్నట్లే. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో పగలు 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో కాకులు, పిచ్చుకలు, గోరింకలు, పావురాళ్లు, గద్దలు, కొంగలతో పాటు సైబీరియా, నార్త్, సెంట్రల్ ఆసియా ప్రాంతాల నుంచి వలస వచ్చే రెడ్‌శాంక్స్, వార్‌బర్డ్స్, పికెట్స్, పెలికాన్స్ వంటి జాతులు విలవిలలాడుతున్నాయి. ఉత్తరాంధ్రలో పరిస్థితి తీవ్రం... హుద్‌హుద్ తుపాను కారణంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పచ్చదనం మొత్తం హరించుకుపోయింది. దీంతో వేసవిలో గూడు (నెస్టింగ్) కోసం పక్షులకు కష్టకాలం వచ్చింది. కంబాలకొండ వైల్డ్‌లైఫ్ శాంచురీ మొత్తం తుపాను తీవ్రత కారణంగా దెబ్బతింది. దీంతో ఏటా ఇక్కడికొచ్చే పక్షులు ఈసారి లేకుండా పోయాయి. పశ్చిమగోదావరి జిల్లా కొల్లేరు, గుంటూరు జిల్లా ఉప్పలపాడు, నెల్లూరు జిల్లా పులికాట్ ప్రాంతాల్లోనూ ఎండల వల్ల పక్షుల సంఖ్య తగ్గిందని పరిశోధకులు చెబుతున్నారు. ఏటా ఏప్రిల్ నుంచి జూలై మధ్యకాలంలో జెముడు కాకులు, రామచిలుకలు, గద్దలు, గోల్డెన్ ఓరియోల్, బ్రామినీకైట్స్, అలెగ్జాండర్ పెరాకైట్స్ వంటివన్నీ పిల్లలను కనే దశలో ఉంటాయి. ఎండల కారణంగా వాటి గుడ్లు ముందుగానే చితికిపోయి కొత్తతరం ఆగిపోతోంది. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో మసలే కాకులు, పిచ్చుకలు, గోరింకలు వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. -
అగ్గి లేస్తే బుగ్గే
జిల్లాలో అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అంతంతమాత్రమే... ఫైర్ స్టేషన్లలో పీడిస్తున్న సిబ్బంది లేమి మూలకుపడ్డ ఫైరింజన్లు.. నీటి కొరత కానరాని ప్రత్యామ్నాయ చర్యలు వేసవి కాలం వచ్చేసింది... ఇప్పటికే మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఈ కాలంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. అరుుతే మన జిల్లా యంత్రాంగం ఇంకా మేల్కొన్నట్లు లేదు. ఫైరింజన్ల కొరత... ఫైర్ స్టేషన్లలో సిబ్బంది లేమి పీడిస్తుండగా... నీటి తిప్పలు వెక్కిరిస్తున్నారుు. జిల్లావ్యాప్తంగా ఫైర్ స్టేషన్లు, ఫైరింజన్ల (అగ్నిమాపక యంత్రాలు) దుస్థితి, నీటి తిప్పలపై ‘సాక్షి’ ఫోకస్... భూపాలపల్లి : పారిశ్రామిక ప్రాంతమైన భూ పాలపల్లి నియోజకవర్గంలో అగ్నిమాపక కేంద్రం లేదు. పరకాల వాహనమే దిక్కు. ► స్టేషన్ ఘన్పూర్ : స్టేషన్‌ఘన్‌పూర్‌లో కూడా ఫైర్‌స్టేషన్ లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే జనగామ లేదా హన్మకొండ నుంచి ఫైర్ ఇంజన్ రావాల్సిందే. ► వర్ధన్నపేట టౌన్ : వర్ధన్నపేటలో అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి స్థలాన్ని కేటాయించినా పనులు మొదలుకాలేదు. ►పాలకుర్తి : ఈ నియోజకవర్గంలో కూడా ఫైర్ స్టేషన్ లేదు. నియోజకవర్గాల వారీగా ఫైర్ స్టేషన్ల దుస్థితి ► డోర్నకల్ : ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా.. మరిపెడలో ఫైర్‌స్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి 2 మండలాలకు మాత్రమే సేవలందుతున్నాయి. మిగతా మండలాలకు మహబూబాబాద్ నుంచి అగ్నిమాపక వాహనం రావా ల్సి వస్తోంది. సకాలంలో చేరకపోవడంతో నష్టం ఎక్కువగా ఉంటోంది. ► జనగామ : నియోజకవర్గ కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఉండగా.. దీని పరిధిలో 11 మండలాలు వస్తున్నా యి. 16 మంది సిబ్బందికి 11 మందే ఉన్నారు. నీటిని బయట నింపుకోవాల్సి వస్తోంది. ► మహబూబాబాద్ : 7 మండలాలకు మానుకోటలోని ఫైరింజనే దిక్కు. నీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. ► నర్సంపేట : నర్సంపేటలోని ద్వారకపేటలో ఫైర్‌స్టేషన్ ఉంది. ఎక్కడైనా ప్రవూదం జరిగితే.. వూర్గవుధ్యలో నీరు నింపుకోవాల్సిన దుస్థితి. ► పరకాల : పరకాలలోని అగ్నిమాపక కేంద్రంలో అన్నీ సమస్యలే. నీటి సమస్య తీవ్రంగా ఉండగా.. 15మందికి గాను పది మంది సిబ్బందే ఉన్నారు. వాహనం కూడా తరచూ మరమ్మతులకు వస్తోంది. ► ములుగు : ములుగు వ్యవసాయశాఖ కార్యాలయంలో ఫైర్‌స్టేషన్ ఉంది. ఈ నియోజకవర్గంలోని ఆరు మండలాలతోపాటు భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం మండలం చెల్పూరు వరకు ఇక్కడి నుంచే వాహనం వెళ్లాల్సి వస్తోంది. ►తూరు, పశ్చిమ : వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఫైర్ స్టేషన్లో 21 మందికి ఆరుగురు, పశ్చిమ సెగ్మెంట్ పరిధిలోని హన్మకొండ బాలసముద్రంలోని స్టేషన్లో 10 మందికి ఏడుగురే విధులు నిర్వర్తిస్తున్నారు. వాహనాల్లో కూడా ఒకటి మూలన పడింది. ఫైర్‌స్టేషన్ లేక కష్టాలు పాలకుర్తి: పాలకుర్తి నియోజకవర్గంలో ఐదు మండలాలు 101 రెవెన్యూ గ్రామాలున్నాయి. సగటున ఏటా నియోజకవర్గంలో 10 కి పైగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ ఫైర్‌స్టేషన్ లేకపోవడంతో వీటి నివారణ సాధ్యం కావడం లేదు. అగ్ని ప్రమాదాలు జరిగితే తొర్రూరు మండలానికి.. మహబూబాబాద్ నుంచి, రాయపర్తి మండలానికి వరంగల్ నుంచి, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాలకు జనగామ నుంచి ఫైర్ ఇంజిన్ రావాల్సి ఉంటుంది. సుమారు 40 - 50 కి.మీ దూరం నుంచి ఫైర్ ఇంజిన్ వచ్చే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే తొర్రూరు. రాయపర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాలకు 20-25 కి.మీ దూరం మాత్రమే ఉంటుంది. ఏ మండలంలో ప్రమాదం జరిగినా సమయానికి ఫైర్ ఇంజిన్ చేరుకునే అవకాశం ఉంటుంది. పరిధి పెద్దది.. బండి పాతది పరకాల : పరకాల అగ్నిమాపక కేంద్రంలో అన్ని సమస్యలే. వాటర్ లెండర్ వాహనం పాతది. దీన్ని నింపేందుకు నాలుగు గంటలు పడుతోంది. వాటర్ సంప్ల్లో నీరు నింపితే ఇంకిపోతోంది. ఫైరింజన్ పికప్కే పావుగంట పడుతోంది. ఏయిర్ నింపడానికి వీలుకావట్లేదు. సరిపడా నీళ్లు లేవు. మంటలార్పేందుకు తగినంత సిబ్బంది లేరు. పరకాల పరిధిలో ఆత్మకూరు, రేగొండ, శాయంపేట, మొగుళ్లపల్లి, చిట్యాల, భూపాలపల్లి మండలాలున్నారుు. 15మంది సిబ్బందికి పది మంది మాత్రమే ఉన్నారు. అందులో ఇద్దరు డిప్యూటేషన్‌పై ఇక్కడ పనిచేస్తున్నారు. ఇద్దరు డ్రైవర్ ఆపరేటర్, నాలుగు ఫైర్‌మెన్ పోస్టులు భర్తీ చేయూల్సి ఉంది. రాజయ్య హామీ.. నెరవేరదేమీ.. స్టేషన్‌ఘన్‌పూర్ : జిల్లాలో పెద్ద నియోజకవర్గం స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు నేటి కీ సన్నాహాలు చేపట్టడం లేదు. ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. తహ శీల్దార్ రామ్మూర్తి తన కార్యాలయ ఆవరణలో భూసర్వే నిర్వహించినా జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు నేటికీ రాలేదు. అగ్ని ప్రమాదం జరిగితే 28 కిలోమీటర్ల దూరంలోని జనగామ నుంచి లేదా 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న హన్మకొండ నుంచి ఫైరింజన్ రావాల్సి వస్తోంది. అరకొరగా సిబ్బంది.. జనగామ: జనగామ అగ్నిమాపక కేంద్రంలో వసతులు కరువయ్యూరుు. 11 మండలాలకు పెద్దిదిక్కుగా ఉన్న ఇక్కడ సిబ్బంది కొరత వేధిస్తోంది. ఫైర్ ఆఫీసర్‌తో కలిపి 16 మంది సిబ్బంది ఉండాలి. కానీ 11 మందే ఉన్నారు. 10 మంది ఫైర్మెన్లకు గాను నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నారుు. ముగ్గురు డ్రైవర్ కమ్ ఆపరేటర్లు ఉండాల్సి ఉండగా ఒక పోస్టు ఖాళీగా ఉంది. సిబ్బందికి అదనపు పని భారం పడుతోంది. నీటి సౌకర్యం లేదు. బయటకు వెళ్లి ఫైర్ట్యాంకర్ను నింపుకోవాల్సి వస్తోంది. వేసవిలో వచ్చిపోయే కరెంటుకు ఏ బావి వద్ద నింపుదామన్నా ఇబ్బందే. కార్యాలయ భవనం శిథిలావ స్థకు చేరింది. వర్షాకాలంలో ఉరుస్తోంది. సిబ్బంది విశ్రాంతి గది చాలా చిన్నగా ఉంది. ప్రహరీ నిర్మాణం, నీటి ట్యాంకు మరమ్మతుకు నిధులు మంజూరైనట్లు సమాచారం ఉందని ఫైర్ ఆఫీసర్ బుచ్చి ఎల్లయ్య తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తిలలో ఫైర్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించాలని కోరారు. ములుగులో వసతుల లేమి ములుగు : స్థానిక అగ్నిమాపక కేంద్రం ప్రస్తుతం వ్యవసాయశాఖ గోదాంలో కొనసాగుతోంది. ములుగు నుంచి మంగపేట అకినపల్లి మల్లారం వరకు సుమారు 80 కిలో మీటర్ల పరిధి ఉండడం.. ఒకే ఫైర్‌స్టేషన్ ఉండడంతో పూర్తిస్థారుులో సేవలు అందడం లేదు. నియోజకవర్గంలోని ఆరు మండలాలతోపాటు భూపాలపల్లిలోని గణపురం మండలం చెల్పూరు వరకు అష్టకష్టాలతో సేవలందిస్తున్నారు. 16 మందికి 12 మంది సిబ్బందే ఉన్నారు. 2013లో డిగ్రీ కళాశాల ఆవరణలో 20 గుంటల స్థలం కేటాయించారు. కానీ నిధుల్లేక పనులు ముందుకు సాగలేదు. వర్షాభావ పరిస్థితులతో చెరువులు, కుంటలు ఎండిపోయాయి. అగ్ని ప్రమాదాల నివారణకు నీటి కష్టాలు తప్పేలా లేవు. సకాలంలో అందని సేవలు డోర్నకల్ : నియోజకవర్గంలో మరిపెడలో మాత్రమే ఫైర్‌స్టేషన్ ఉంది. డోర్నకల్, కురవి మండలాలతో పాటు నర్సింహులపేటలోని కొన్ని గ్రామాలకు మహబూబాబాద్ ఫైర్ స్టేషన్ సేవలు అందుతున్నా.. ఫలితమైతే ఉండట్లేదు. మరిపెడ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో 2007లో అగ్నిమాపక కేంద్రం కాంటాక్ట్ పద్ధతిన ఔట్ సోర్సింగ్ స్టేషన్‌గా ఏర్పాటు చేశారు. ఫైరింజన్‌ను అద్దెకు తీసుకుని 14 మంది సిబ్బందిని కాంటాక్ట్ పద్ధతిన నియమించారు. వరంగల్ లాంటి ప్రాంతాల నుంచి వచ్చి చాలీచాలని వేతనం(రూ. 5000)తో పనిచేయడం కష్టమవుతోందని సిబ్బంది చెబుతున్నారు. అగ్నిమాపక వాహనం కూడా పాత మోడల్ కావడంతో తలుపులు సక్రమంగా పడట్లేదు. నీటి కోసం మూడు కిలోమీటర్ల దూరంలోని చెరువుకు లేదా ఖమ్మం జిల్లా తిరుమాలాయపాలెం సమీపంలోని కెనాల్‌కు ఫైరింజన్ వెళ్లాల్సి వస్తోంది. ప్రతీ ఆదివారం మరిపెడలో సంత నిర్వహించడం మెయిన్ రోడ్డు నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు రోడ్లపై దుకాణాలు ఏర్పాటు చేస్తుండటంతో ఆ రోజు అగ్నిమాపక వాహనాన్ని వేరే ప్రాంతంలో నిలుపుతున్నారు. అగ్నిమాపక కేంద్రం నిర్వహణను ప్రభుత్వ పరిధిలోకి తెచ్చి పూర్తిస్థాయి వసతులు కల్పించాలని, వేతనాలు పెంచాలని సిబ్బంది కోరుతున్నారు. ఏడు మండలాలకు ఒక్కటే.. మహబూబాబాద్ : పట్టణంలోని ఫైర్‌స్టేషన్ పరిధిలో మానుకోట, కురవి, డోర్నకల్, తొర్రూరు, నెల్లికుదురు, కేసముద్రం, నర్సింహులపేట మండలాలున్నాయి. మానుకోట నుంచి నర్సింహులపేటకు దూరభారం ఉండడంతో సేవలు సమర్థంగా అందడం లేదు. ఈ కార్యాలయంలో బోర్ వేసినా సమృద్ధిగా నీరు లేదు. పట్టణ శివారులోని మున్నేరువాగు, మండలంలోని ఈదులపూసపల్లి చెరువులో నీటి మట్టం తగ్గడంతో ట్యాంకు నింపుకోవడం సమస్యగా మారుతోంది. మున్సిపాలిటీ సిబ్బంది కూడా ట్యాంక్ నింపడానికి ఇబ్బందులు పెడుతున్నారని సిబ్బంది చెబుతున్నారు. ఫైరింజన్ కండీషన్ అంతంతమాత్రమే. కార్యాలయంలో మరో డ్రైవర్, ఫైర్ మెన్ సిబ్బందిని భర్తీ చేయూల్సి ఉంది. గడువులోగా ఏర్పాటయ్యేనా? వర్ధన్నపేట టౌన్: ఈనెల 11న స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో అగ్నిమాపక భవన నిర్మాణానికి 694 చదరపు గజాల స్థలాన్ని ఎమ్మెల్యే అరూరి రమేష్ చేతుల మీదుగా అందచేశారు. మూడు నెలల్లో నిర్మాణం పూర్తి చేసి కార్యాలయూన్ని ప్రారంభిస్తామని అధికారులు స్పష్టంచేశారు. ఇప్పటి వరకైతే పనులేవీ ప్రారంభం కాలేదు. మరి గడువులోగా పనులు పూర్తయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. వేసవిలో వర్ధన్నపేట పిరంగి గడ్డ ప్రాంతంలో వరి పొలం అంటుకుని అగ్రిమాపక శకటం సంఘటనా స్థలానికి వచ్చేలోగా బూడిదే మిగిలింది. వరంగల్ నుంచి ఎంత వేగంగా వచ్చినా ట్రాఫిక్ ఇబ్బందులతో గంట సమయం పడుతుంది. కాలితే బూడిదే.. భూపాలపల్లి : కోల్‌బెల్ట్ పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి నియోజకవర్గంలో అగ్నిమాపక కేంద్రం లేకపోవడం విచిత్రమే. ఏటా వేసవిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదాలతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. భూపాలపల్లి, గణపురం, రేగొండ, శాయంపేట, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో ఎక్కడ అగ్నిప్రమాదం జరిగినా పరకాల అగ్నిమాపక కేంద్రాన్ని ఆశ్రయించాల్సి వస్తోంది. ఫైరింజన్ వచ్చేలోగా ఆస్తులు బుగ్గిపాలవుతున్నారుు. 2010లో భూపాలపల్లి మండలం జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగి విద్యార్థుల సర్టిఫికెట్లు, విలువైన కాగితాలు కాలిబూడిదయ్యాయి. 2011లో రాంపూర్ వద్ద దేవాదుల ఎత్తిపోతల పథకానికి చెందిన నాలుగు మోటార్లు కాలిపోగా రూ. కోట్లలో నష్టం వాటిల్లింది. ఇలా ఏటా జరుగుతున్నా ఫైర్‌స్టేషన్ ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఒకేసారి రెండు ప్రమాదాలు జరిగితే.. పోచమ్మమైదాన్: వరంగల్ ట్రైసిటీలోని లక్షల జనాభాకు తగినట్లుగా వ్యాపారాలు విస్తరిస్తున్నారుు. కానీ, ఏదైనా ఉపద్రవం సంభవిస్తే దాన్ని అరికట్టడం మాట అటుంచి నష్టనివారణ చర్యలకూ సిబ్బంది సరిపడా లేరు. ట్రైసిటీ మొత్తంగా వరంగల్ మట్టెవాడ, హన్మకొండ బాలసముద్రంలో ఫైర్ స్టేషన్లు మాత్రమే ఉన్నారుు. మట్టెవాడలో మూడు అగ్నిమాపక నిరోధక వాహనాలు ఉండగా ఇందులో ఒకటి మూలన పడింది. ఇక్కడ 21మందికి గాను ఆరుగురు సిబ్బందే ఉన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని ఫైర్ స్టేషన్లో ఒకటి పెద్దది, ఇంకోటి చిన్న వాహనం ఉంది. ఇక్కడ పది మందికి ఏడుగురు సిబ్బందే విధుల్లో ఉన్నారు. నగరంలో రెండు చోట్ల ఒకేసారి ప్రమాదాలు జరిగితే మాత్రం సేవలందించడం కష్టతరమవుతోంది. అగ్నిమాపక కేంద్రాల సంఖ్య పెంచడంతో పాటు సరిపడా వాహనాలు కేటారుుంచాలని ప్రజలు కోరుతున్నారు. పోస్టులు భర్తీ చేసి తమపైభారం తగ్గించాలని సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో అధికారులు తక్షణం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.