
ఎండ @ 40.5
సిటీబ్యూరో: నగరంలో మండుటెండలు మళ్లీ ఠారెత్తిస్తున్నాయి. సోమవారం గరిష్టంగా 40.5 డిగ్రీలు,కనిష్టంగా 27.3 డిగ్రీలు,గాలిలో తేమ 28 శాతంగా నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లిన పలువురు మండుటెండకు సొమ్మసిల్లారు.
మంగళవారం నుంచి రోహిణీ కార్తె మొదలవనున్న నేపథ్యంలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మధ్యాహ్నం వేళ ఇంటి నుంచి బయటికి వెళ్లేవారు గొడుగు, క్యాప్, చలువ కళ్లద్దాలు ధరించాలని సూచించింది. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.