తనకల్లు : మండలంలోని గొళ్లవారిపల్లికి చెందిన నరసమ్మ(60) వడదెబ్బతో గురువారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. నల్లచెరువు మండలం కె.పూలకుంట నుంచి తన స్వగ్రామానికి బయలుదేరిన ఆమె బస్సు దిగి కాలినడకన వెళ్తుండగా.. ఉన్నపళంగా కుప్పకూలిపడిపోయిందని వివరించారు. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.