తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజులపాటు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి
సాక్షి, హైదరాబాద్/నెట్‌వర్క్: తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజులపాటు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బుధవారం ఆదిలాబాద్‌లో అత్యధికంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. నిజామాబాద్‌లో 43.9, మెదక్‌లో 43 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు రాజధాని హైదరాబాద్‌లోనూ ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం నగరంలో గరిష్టంగా 41.2 డిగ్రీలు, కనిష్టంగా 26.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.
వడదెబ్బతో 31 మంది మృతి
రాష్ట్రవ్యాప్తంగా మండుతున్న ఎండలకు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. వడదెబ్బతో వరంగల్ జిల్లాలో తొమ్మిది మంది, నల్లగొండ జిల్లాలో ఎనిమిది మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో ఆరుగురు, కరీంనగర్ జిల్లాలో ముగ్గురు, ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు, మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు.