హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వడ దెబ్బ కారణంగా ఆదివారం తొమ్మిది మంది మృతిచెందారు. తెలంగాణలో.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నాచారం గ్రామంలో వడదెబ్బకు గురై ఓ వృద్ద అనాధ మహిళ కలవేని లచ్చమ్న(65) మృతిచెందింది. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో వడదెబ్బతో వృద్దురాలు పలుగుల నర్సయ్య గారి సత్తెమ్మ (65) మృతిచెందింది. కరీంనగర్‌జిల్లా కొత్తపల్లికి చెందిన భూస రాములు వడదెబ్బతో మృతిచెందాడు.
జేఎస్‌భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామానికి చెందిన మొగిలి కూడా వడదెబ్బతో మృతిచెందాడు. నల్గొండజిల్లా చౌటుప్పల్‌లో వడదెబ్బకు గురై చేనేత కార్మికుడు సంగిశెట్టి స్వామి(65) మృతిచెందాడు. కట్టంగూర్‌లో రెడ్డిపల్లి బుచ్చయ్య(80) ఇంటి వద్దనే ఉంటూ తీవ్ర ఎండలతో అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.
ఆంద్రప్రదేశ్‌లో..
నెల్లూరుజిల్లా కావలిరూరల్ మండలంలోని కొత్తపల్లికి చెందిన ఆదెమ్మ(75) వడదెబ్బతో మృతిచెంది. ప్రకాశంజిల్లా దర్శి పట్టణంలోని పొదిలి రోడ్డులో వడదెబ్బ తగిలి మేడగం వెంకటరమణారెడ్డి(40) అనే వ్యక్తి మతిచెందాడు. హనుమంతునిపాడు మండలంలోని కూటాగుండ్ల పంచాయతీ పరిధి పాతమల్లవరం గ్రామంలో నాళి కొండయ్య(76) మృతిచెందాడు.
వడదెబ్బతో తొమ్మిది మంది మృతి
Published Sun, May 21 2017 8:59 PM | Last Updated on Tue, Sep 5 2017 11:40 AM
Advertisement
Advertisement