
నడినెత్తిన నిప్పులే..
- రాష్ట్రంలో మండుతున్న ఎండలు
- ఆదిలాబాద్‌లో 44.4 డిగ్రీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడు భగభగమంటున్నాడు. ఆదివారం అనేక చోట్ల 43, 44 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధి కంగా ఆదిలాబాద్‌లో 44.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో 44 డిగ్రీలు, రామగుండంలో 43.4, నల్ల గొండ, మెదక్‌లో 43, ఖమ్మం, భద్రాచలంలో 42, హకీంపేట 41, హన్మకొం డలో 40.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. మండుతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వడగాడ్పులు వీస్తాయని, సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోద వుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
నగరంలో 42.4 డిగ్రీలు..
గ్రేటర్‌పైనా ప్రచండభానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఆదివారం హైదరా బాద్‌లో గరిష్టంగా 42.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణో గ్రత ఇదే. మండుటెండకు వేడి గాలులు తోడవ్వడంతో నగరవాసులు ఇబ్బం దులు పడుతున్నారు. ఎండతీవ్రత పెరగ డంతో ఆదివారం మధ్యాహ్నం పలు ప్రధాన రహదారులు బోసిపోయి కనిపిం చాయి. మరోవైపు రాగల 48 గంటల పాటు నగరంలో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
వడదెబ్బతో ముగ్గురు మృతి
సాక్షి నెట్‌వర్క్: తెలంగాణ జిల్లాల్లో వడదెబ్బతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం జూపాకకు చెందిన తాళ్లపల్లి దానయ్య(70) శనివారం పశువుల మేతకు వెళ్లి అస్వస్థతకు గురయ్యాడు. ఆదివారం వేకువజామున మృతి చెందాడు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మాధారంకలాన్ గ్రామానికి చెందిన మామిడాల మల్లయ్య(68) ఆదివారం వ్యవసాయ పనుల కోసం వెళ్లి ఎండతీవ్రతతో అస్వస్థతకు గురై చనిపో యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లికి చెందిన ఒగ్గు బుచ్చిరాజం (55) శనివారం గొర్రెలను మేపేందుకు వెళ్లాడు. రాత్రి ఇంటికి వచ్చి నలతగా ఉందని చెప్పాడు. ఉదయం చూడగా, చనిపోయి ఉన్నాడు.