పెద్దపంజాణి/శ్రీకాళహస్తి టౌన్/గంగవరం/కార్వేటినగరం/పెనుమూరు/గంగాధరనెల్లూరు/ఏర్పేడు/చంద్రగిరి/బంగారుపాళెం/ఐరాల / ఓటేరు(తిరుపతి రూరల్)/కేకే పేట(కల్లూరు): జిల్లాలో వడదెబ్బ కారణంగా మంగళవారం 17 మంది మృతి చెందారు. పెద్దపంజాణి మండలం ఆకులవారిపల్లె గ్రామానికి చెందిన శ్రీరామయ్య(38) పొలం పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి చేరుకోగానే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపు మృతి చెందాడు. బసవరాజకండ్రిగ గ్రామానికి చెందిన సమ్మక్క(70) ఎండతీవ్రతకు తట్టుకోలేక ఇంట్లోనే మృతి చెందింది. ఒంటిళ్లుకు చెందిన గోవిందప్ప కుమారుడు సుబ్రమణ్యం(43) పొలం పనులు చేస్తూ కుప్పకూలిపోయాడు. సహచరులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లే లోపు మృతి చెందాడు.
శ్రీకాళహస్తి పట్టణం బీపీ అగ్రహరం రెవెన్యూ కాలనీకి చెందినధనయ్యు(75) ఎండల తీవ్రతకు పది రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. సోవువారం వాంతులు, విరేచనాలు కావడంతో ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. వుంగళవారం పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వుృతి చెందాడు. వీఎం పల్లికి చెందిన కె.చలపతి(50) సోవువారం భవన నిర్మాణ పనులకు వెళ్లాడు. రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఏరియూ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.
గంగవరం మండలం వంటిండ్ల గ్రామానికి చెందిన సుబ్రమణ్యం(45) మంగళవారం పది గంటలకు పొలంలో పనులు చేస్తుండగా కుప్పకూలిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించేలోపు మరణించాడు. కార్వేటినగరం త్యాగరాజుపిళ్ళై వీధికి చెందిన సుబ్రమణ్యంరెడ్డి కుమారుడు దామోదరం(40) కూలి పనులకు వెళ్లి ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తీసుకెళుతుండగా మృతిచెందాడు. పెనుమూరు గ్రామసేవత ముత్యాలమ్మ ఆలయ అర్చకులు పార్థసారథి(75) సోమవారం రాత్రి వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురయ్యాడు.
పెనుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చికిత్స చేసేలోపు మృతి చెందాడు. గంగాధరనెల్లూరు మండలం వేల్కూరు గ్రామానికి చెందిన కుప్పిరెడ్డి భార్య రాజమ్మ(68) పొలం పనులకెళ్లి సొమ్మసిల్లిపడి పోయింది. ఆస్పత్రికి తీసుకెళుతుండగా మృతి చెందింది. వైఎస్సార్‌సీపీ నేత తిమ్మిరెడ్డిపల్లి రామచంద్రారెడ్డి (67) ఎండ తీవ్రతకు తట్టుకోలేక మృతిచెందారు. కాంగ్రెస్ హయాంలో గంగాధరనెల్లూరు సింగిల్‌విండో డెరైక్టర్‌గా పనిచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు.
ఏర్పేడు మండలం పాయిల్‌సెంటర్ ఎస్టీకాలనీకి చెందిన బత్తెవ్ము(67) ఎండతీవ్రతకు అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి తీసుకెళుతుండగా మృతిచెందింది. చంద్రగిరి జెండామాను వీధిలో కాపురముంటున్న యూసఫ్ భార్య ఉసూద్ బేగం (70) ఎండ తీవ్రత తట్టుకోలేక ఉదయం అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి తీసుకె ళ్లేలోపు మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. బంగారుపాళెం మండలం బోడబండ్ల గ్రామానికి చెందిన పి.వెంకటాద్రిబోయుడు(63) మడికోత పనులు చేపడుతుండగా ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన ద్విచక్ర వాహనంలో బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళుతుండగా మృతిచెందాడు.
పులిచెర్ల మండలం ఎల్లంకివారిపల్లె(కేకేపేట) మసీదు వీధికి చెందిన ఎస్.నవాబ్‌జాన్(53) ఎండ తీవ్రతకు మంగళవారం రాత్రి స్పృహతప్పి పడిపోయాడు. ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.
తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ ఓటేరుకు చెందిన పి.దొరస్వామినాయుడు(70) తిరుపతి వ్యవసాయ మార్కెట్‌లో కూలీగా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం వడదెబ్బకు గురయ్యాడు. వాంతులు, విరేచనలు, యూరిన్‌లో రక్తం పడడంతో రుయా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు.
ఐరాల మండలం పైపల్లె పంచాయతీ జంగాలపల్లె గ్రామానికి చెందిన సి.కుమారి(42) సోమవారం పొలం పను లు చేసి అస్వస్థతకు గురైంది. మంగళవారం వేకువజామున రెండు గంట లకు మరణించింది. వేదగిరివారిపల్లె పంచాయతీ గుట్టపాళ్యం గ్రామానికి చెందిన శివశంకర్ నాయుడు (50) పొలానికి వెళ్లి తిరిగి వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. ప్రథమ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వడదెబ్బతో 17మంది మృతి
Published Wed, Apr 27 2016 4:22 AM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM
Advertisement
Advertisement