వడదెబ్బతో వృద్ధురాలి మృతి
Published Wed, Mar 22 2017 12:45 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
పత్తికొండ టౌన్: పట్టణంలోని శ్రీరాములపేటలో నివాసముంటున్న ఎరుకలి దుగ్గెమ్మ(62) మంగళవారం వడదెబ్బతో మృతిచెందింది. వెదురుదబ్బలతో చాటలు అల్లి ఊరిలో వీధుల్లో తిరిగి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న దుగ్గెమ్మ వడదెబ్బతో అస్వస్థతకు గురైంది. మంగళవారం ఉదయం తీవ్ర అస్వస్థతతో ఉండటంతో బంధువులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందింది. వడదెబ్బతో మృతిచెందిన వృద్ధురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎరుకల హక్కుల పోరాటసమితి నాయకుడు దుగ్గెన్న విజ్ఞప్తి చేశారు.
Advertisement
Advertisement