
కళ్ల ముందే కన్నుమూశాడు...
ఈయన సుభాష్‌నగర్ డివిజన్ పాండుబస్తీకి చెందిన అర్జున్ నాయక్.వయసు 60. భార్యతో గొడవపడి గురువారం ఇల్లు వదిలి వచ్చిన ఆయన సాయిబాబానగర్ హమీద్ బస్తీ ఉర్దూ పాఠశాల ఆవరణలో ఎండకు ఇలా సొమ్మసిల్లి పడివున్నాడు.
హైదరాబాద్: ఈయన సుభాష్‌నగర్ డివిజన్ పాండుబస్తీకి చెందిన అర్జున్ నాయక్.వయసు 60. భార్యతో గొడవపడి గురువారం ఇల్లు వదిలి వచ్చిన ఆయన సాయిబాబానగర్ హమీద్ బస్తీ ఉర్దూ పాఠశాల ఆవరణలో ఎండకు ఇలా సొమ్మసిల్లి పడివున్నాడు.
► శుక్రవారం ఉదయం 10.30 గంటలు. నాయక్‌ను గమనించిన స్థానికులు అతడిని లేపి మంచి నీళ్లు, కాస్తంత తిండి అందించారు. కానీ తినలేని పరిస్థితి అతనిది.
► స్థానికుల సమాచారంతో వచ్చిన 108 సిబ్బంది కొన ఊపిరితో ఉన్న అతడికి ప్రాథమిక చికిత్స అందించారు. సెలైన్ పెట్టారు. కానీ... ఫలితం శూన్యం... ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. పోలీసుల సాయంతో ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతిచెందినట్టు నిర్ధారించారు.
► మండే ఎండలు... వడ గాడ్పులు... నిండు ప్రాణాలను నిలువునా బలితీసుకున్న మరో విషాదం ఇది. కట్టెలు కొట్టుకుని జీవించే ఈ శ్రమజీవి తాపానికి తట్టుకోలేక కళ్లముందే కుప్పకూలిన ఈ ఘటన అక్కడివారి హృదయాలను ద్రవింపజేసింది.
- హైదరాబాద్