వడదెబ్బతో వృద్ధుడి మృతి
Published Wed, Jun 1 2016 5:56 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
అవనిగడ్డ: పించన్ కోసం వచ్చిన ఓ వృద్ధుడు వడదెబ్బకు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. అవనిగడ్డకు చెందిన రాసమళ్ల కృష్ణమూర్తి(80) అనే వ్యక్తి వడదెబ్బతో బుధవారం మృతిచెందాడు. పింఛన్ తీసుకోవడానికి స్థానిక పంచాయతీ కార్యాలయానికి వచ్చినపుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు ఈ సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు.
Advertisement
Advertisement