
నర్సంపేట రూరల్/బయ్యారం/భువనగిరి అర్బన్ : వడదెబ్బతో వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం నలుగురు మృతి చెందారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం దాసరిపల్లికి చెందిన మేకల సమ్మయ్య(60), నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండ లం బాస్మాన్‌పల్లికి చెందిన శివరాత్రి వెంకటయ్య(70), భువనగిరి పట్టణం తారకరామనగర్ కాలనీకి చెందిన కోళ శ్రీను(45), మోత్కూరు మండల కేంద్రం సుందరయ్య కాలనీకి చెందిన బుర్ర వెంకటమ్మ(58) మృతి చెందారు.