వడదెబ్బ బారినపడి రాష్ట్రంలో శనివారం 44 మంది మృతి చెందారు.
వడదెబ్బకు మరో 44 మంది మృతి
సాక్షి, హైదరాబాద్: వడదెబ్బ బారినపడి రాష్ట్రంలో శనివారం 44 మంది మృతి చెందారు. ఖమ్మం జిల్లాలో పదకొండు మంది, కరీంనగర్ జిల్లాలో ఆరుగురు, నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు, ఆదిలాబాద్ జిల్లాలో ఐదుగురు, వరంగల్‌లో ఎనిమిది మంది, నల్లగొండలో 9 మంది, మెదక్‌లో ఒకరు, మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకరు మరణించారు. కొద్ది రోజులుగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న తీవ్ర వడగాడ్పులు ఆదివారం కూడా కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, నల్లగొండ జిల్లాల్లో వీటి తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. అలాగే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. శనివారం రామగుండంలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు గత 24 గంటల్లో ఖమ్మం జిల్లా ఏన్కూరు, జూలూరుపాడుల్లో 3 సెంటీమీటర్లు, వరంగల్ జిల్లా హసన్‌పర్తిలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
శనివారం ప్రధాన పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు
ప్రాంతం ఉష్ణోగ్రత
రామగుండం 45.0
హన్మకొండ 44.5
ఖమ్మం 43.6
ఆదిలాబాద్ 43.3
నిజామాబాద్ 43.0
నల్లగొండ 43.0
మెదక్ 42.0
హైదరాబాద్ 41.0
మహబూబ్‌నగర్ 40.1
హకీంపేట 38.8