ఎండ ఎక్కువగా ఉండడంతో చెట్టు కింద సేదతీరుతున్న ఓ వృద్ధుడు నిద్రలోనే ప్రాణాలు వదిలాడు.
ఎండ ఎక్కువగా ఉండడంతో చెట్టు కింద సేదతీరుతున్న ఓ వృద్ధుడు నిద్రలోనే ప్రాణాలు వదిలాడు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. గ్రామంలో వెంకటి (65) కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. గ్రామంలో ఒంటరిగానేఉంటున్న అతడు శనివారం ఎండ ఎక్కువగా ఉండడంతో ఇంటికి సమీపంలో ఓ చెట్టు కింద పడుకున్నాడు. సాయంత్రమైనా నిద్రలేవకపోయే సరికి స్థానికులు తట్టి చూడగా అప్పటికే మృతి చెందినట్టు గుర్తించారు.