వడదెబ్బతో ఇద్దరు చిన్నారుల మృతి | Two children died of sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఇద్దరు చిన్నారుల మృతి

Published Mon, May 2 2016 1:14 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

Two children died of sunstroke

వడదెబ్బ కారణంగా ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం బుద్ధారం గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో చిన్నారుల మృతదేహాలను సోమవారం గుర్తించారు. మండలంలోని లింగపల్లి గ్రామానికి చెందిన యేలాది లక్ష్మి తన ఇద్దరు పిల్లలు మధు (12), అశోక్ (8)తో కలసి బుద్ధారం గ్రామంలో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఆదివారం కాలినడకన బయల్దేరింది.

 

వడదెబ్బతో ముగ్గురూ స్పృహ తప్పి పడిపోయారు. సోమవారం మధ్యాహ్న సమయంలో వారిని అటవీ ప్రాంతంలో గుర్తించగా... అప్పటికే మధు, అశోక్ మృతి చెంది ఉన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మిని చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement