వేసవి సెలవుల్లో తమ పేద కుటుంబానికి ఆసరా ఉందామని కూలీ పనులకు వెళ్లిన 13 ఏళ్ల బాలిక వడదెబ్బకు గురై ప్రాణాలు విడిచింది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి గ్రామంలో జరిగిన ఈ విషాధ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తెల్లం ఆదిలక్ష్మి ఏడవ తరగతి పరీక్షలు ఇటీవలే రాసింది.
వేసవి సెలవులు కావడంతో కుటంబ పోషణకు తన వంతు సాయంగా పొగాకు కట్టే పనులకు ఆదివారం వెళ్లింది. ఎండలు బాగా ఉండడంతో వడదెబ్బకు గురై అదే రోజు అస్వస్థతకు గురైంది. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి మృతి చెందింది.