సాక్షి, నెట్‌వర్క్: తెలంగాణ జిల్లాల్లో గురువారం వడదెబ్బతో వేర్వేరు చోట్ల 8 మంది మృతి చెందారు. వివరాలు.. ఖమ్మం జిల్లా తిరుమలాయ పాలెం మండలం లకావత్‌తండాకు చెందిన లకావత్ మల్సూర్(38), తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు మద్దినేని రంగయ్య(80), చర్ల మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన సరోజని(78), మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన వడ్డేపల్లి నర్సమ్మ (55), ఆదిలాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి పరిధిలోని ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన గొలుసుల సాయిలు (67), నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండల కేంద్రానికి చెందిన గుండ్ల మోహన్ (43), నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం రాగడప గ్రామ పంచాయతీ పరిధి కుంకుడుచెట్టు తండాకు చెందిన రాతుల హీరా (55), దామరచర్ల మండలం వాడపల్లికి చెందిన ధరావత్ పంతుల్యా (50) ఎండల తీవ్రతతో వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై మృతి చెందారు.
వడదెబ్బతో 8 మంది మృతి
Published Fri, May 1 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM
Advertisement
Advertisement