వడదెబ్బతో నలుగురి మృతి
♦ రోజురోజుకూ తీవ్ర మవుతున్న ఎండలు
♦ పనులకు వెళ్లి పిట్టల్లా రాలుతున్న జనం
వడదెబ్బకు జిల్లాలో సోమవారం ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. ఉదయం నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో రోజురోజుకూ వడదెబ్బ మృతులు పెరుగుతున్నా రు. శంషాబాద్ మండలం కాచారం గ్రామానికి చెందిన తసల యాదయ్య (58), ఘట్‌కేసర్ మండలం ఏదులాబాద్‌కు చెంది న జవాజీ బాల్‌రాజు (67), మంచాల మండలం ఆరుట్లకు చెందిన లక్ష్మమ్మ (55), బషీరాబాద్ మండలం ఎక్మాయికి చెందిన సాయప్ప (55) మృతి చెందిన వారిలో ఉన్నారు.
శంషాబాద్‌రూరల్/ఘట్‌కేసర్/మంచాల /బషీరాబాద్ : వడదెబ్బకు జిల్లాలో సోమవారం ఒక్కరోజే వేర్వేరు ప్రాంతాలకు చెందిన నలుగురు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి.. శంషాబాద్ మండలం కాచారం గ్రామానికి చెందిన తసల యాదయ్య (58) కొన్ని రోజుల క్రితం వడదెబ్బతో అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రిలో చికిత్సలు చేయించారు. కాగా.. ఆదివారం రాత్రి పరిస్థితి విషమించడంతో తిరిగి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అదేవిధంగా ఘట్‌కేసర్ మండలం ఏదులాబాద్‌కు చెందిన జవాజీ బాల్‌రాజు (67) వ్యవసాయకూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆదివారం సాయంత్రం తనకు ఆరోగ్యం సరిగా లేదంటూ స్థానిక వైద్యుడి వద్దకు వెళ్లాడు.
అతను పరీక్షలు నిర్వహించి వడదెబ్బ సోకిందని నిర్ధారించి చికిత్సలు అందించాడు. అయితే ఆదివారం రాత్రి మృతి చెందాడు. సమాచారం అందుకున్న తహ శీల్దార్ విష్ణువర్ధన్, వైద్యుడు సతీష్‌చందర్‌లు సోమవారం గ్రామానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతుడికి భార్య, నలుగురు కొడుకులు, ఒక కుమార్తె ఉంది. మరో ఘటనలో మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన గట్ల లక్ష్మమ్మ (55) వృత్తి రీత్యా వ్యవసాయ కూలీ. ఆదివారం వడదెబ్బకు గురై అనారోగ్యానికి గురైంది. అదే రాత్రి పరిస్థితి విషమించి మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం మృతదే హాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అదే విధంగా బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామానికి చెందిన పోచమొళ్ల సాయప్ప(55) కూలీ పనులు చే స్తూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం ఉపాధి పనులకు వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు తాండూరులోని ప్రభుత్వం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. సాయప్పకు భర్య వెంకటమ్మ, ఇద్దరు కుమారులున్నారు.