మండుతున్న ఉష్ణోగ్రతలు.. వడ గాలులకు జనం పిట్టల్లా రాలుతున్నారు.
మండుతున్న ఉష్ణోగ్రతలు.. వడ గాలులకు జనం పిట్టల్లా రాలుతున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అమ్దాపూర్ గ్రామానికి చెందిన సత్తమ్మ(60) వడదెబ్బకు మృతి చెందింది. బుధవారం వేడికి తాళలేక స్పృహ కోల్పోయిన ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. మార్గమధ్యంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
మరో వైపు ఎండలకు వన్యప్రాణులు సైతం అల్లాడుతున్నాయి. దుర్గి మండలం ఓబులేశుపురం గ్రామ సమీపంలో ఎండలకు ఓ దుప్పి ప్రాణాలు విడిచింది. ఇది గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.