sattamma
-
ఎండకు తాళలేక..
మండుతున్న ఉష్ణోగ్రతలు.. వడ గాలులకు జనం పిట్టల్లా రాలుతున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అమ్దాపూర్ గ్రామానికి చెందిన సత్తమ్మ(60) వడదెబ్బకు మృతి చెందింది. బుధవారం వేడికి తాళలేక స్పృహ కోల్పోయిన ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. మార్గమధ్యంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. మరో వైపు ఎండలకు వన్యప్రాణులు సైతం అల్లాడుతున్నాయి. దుర్గి మండలం ఓబులేశుపురం గ్రామ సమీపంలో ఎండలకు ఓ దుప్పి ప్రాణాలు విడిచింది. ఇది గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. -
మరణంలోనూ వీడని బంధం..
కరీంనగర్ : మూడుముళ్లు... ఏడుడగుల బంధంతో ఏకమైన దంపతులు కడదాకా కలిసే పయనించారు. అనారోగ్యంతో మంచం పట్టిన భర్త.. గుండెపోటుతో చికిత్స పొందుతున్న భార్య.. ఇద్దరూ కొన్ని గంటల తేడాలో మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటకు చెందిన గండ్ర గోవిందరావు(95), సత్తమ్మ (85) దంపతులు. గోవిందరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. భర్తకు సేవచేస్తూ అతనికి తోడుగా ఉన్న సత్తమ్మ వారంరోజుల క్రితం గుండెపోటుకు గురైంది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈక్రమంలో గోవిందరావు శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఆయన మరణించిన కొద్ది గంటల్లో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న సత్తమ్మ కూడా కన్నుమూశారు. భార్యాభర్తలు ఇద్దరు ఒకేరోజు మృతిచెందడంతో బంధువులు, కుటుంబసభ్యులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. సత్తమ్మ మృతదేహాన్ని కోరుట్లపేటకు తీసుకువచ్చి దంపతులిద్దరినీ ఒకే చితిపైన ఉంచి అంత్యక్రియలు జరిపారు. -
మహిళ అనుమానాస్పద మృతి
మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆత్మకూరు మండలం కొంకవానిపల్లె గ్రామానికి చెందిన బోయ సత్తెమ్మ(36) అనే మహిళ సోమవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయింది. మహిళ కోసం కుటుంబసభ్యులు వెతకగా గ్రామ శివారులోని చెరుకు తోటలో సగం కాలిపోయి మృతదేహమై కనిపించింది. గ్రామస్థులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు.