మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆత్మకూరు మండలం కొంకవానిపల్లె గ్రామానికి చెందిన బోయ సత్తెమ్మ(36) అనే మహిళ సోమవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయింది.
మహిళ కోసం కుటుంబసభ్యులు వెతకగా గ్రామ శివారులోని చెరుకు తోటలో సగం కాలిపోయి మృతదేహమై కనిపించింది. గ్రామస్థులు స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు.