ఎండలు బాబోయ్ ఎండలు.. జాగ్రత్తలు తీసుకోకుంటే కష్టం | Beware of Summer and be careful | Sakshi
Sakshi News home page

ఎండలు బాబోయ్ ఎండలు.. జాగ్రత్తలు తీసుకోకుంటే కష్టం

Published Fri, Apr 21 2023 12:28 AM | Last Updated on Fri, Apr 21 2023 12:38 PM

Beware of Summer and be careful

భానుడి భగభగలతో వేసవి తాపం కొనసాగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగానూ రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో తూర్పు దిశగా గాలి వీచింది. 


అనంతపురం అర్బన్‌: ఎండలు మండుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి జిల్లా ప్రజలకు సూచించారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్నం వేళ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోందని, వీలైనంత వరకూ ఉదయం, సాయంత్రం వేళల్లోనే బయటకు రావాలని తెలిపారు. అధికారులు తీసుకోవాల్సిన చర్యలనూ పేర్కొన్నారు.

ఆదేశాలు ఇలా..

● మునిసిపల్‌, పంచాయతీ అధికారులు జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. పట్టణాల్లో అక్కడక్కడా చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలి.

● డ్వామా, ఎంపీడీఓలు ఉపాధి హామీ పనుల వేళల్లో మార్పులు చేసుకోవాలి.

● 104, 108 అంబులెన్స్‌ల్లో ఐస్‌ప్యాక్‌లు, వడదెబ్బ తగిలిన వారికి అసవరమయ్యే మందులు అందుబాటులో ఉంచాలి.

● వడదెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు కావాల్సిన ఏర్పాట్లు ఆరోగ్య కేంద్రాల్లో ఉంచాలి. ప్రజలకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు పంపిణీ చేయాలి.

● వడదెబ్బ తగిలిన వారికి అందించే ప్రాథమిక చికిత్సపై విస్తృత ప్రచారం నిర్వహించాలి.

● అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండాలి. సిబ్బంది, నీటిని అందుబాటులో ఉంచుకోవాలి.

● సూదూర రూట్లలో నడిచే బస్సుల్లో తప్పసరిగా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను ఆర్టీసీ అధికారులు అందుబాటులో ఉంచాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement