అనంతపురం అగ్రికల్చర్ : మూడు నెలల తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గత నాలుగైదు రోజులుగా వాతావరణంలో స్వల్పంగా మార్పులు చోటు చేసుకోవడం, ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ తొలకరి జల్లులు పడటం, గాలివేగం పెరగడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గాయి. అయితే ఉక్కపోత, వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. మొత్తమ్మీద 42 నుంచి 45 డిగ్రీల రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలతో సతమతమైన ‘అనంత’ జనం ఇపుడిపుడే కొంత ఉపశమనం పొందుతున్నారు.
ఆదివారం గుమ్మగట్టలో 40.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శింగనమల 39 డిగ్రీలు, తాడిమర్రి 38.4 డిగ్రీలు, అనంతపురం 38.2 డిగ్రీలు, గార్లదిన్నె 36.8 డిగ్రీలు, కూడేరు, రాప్తాడు 36.5 డిగ్రీలు.. ఇలా అన్ని మండలాల్లోనూ 34 నుంచి 36 డిగ్రీల మధ్య నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 24 నుంచి 26 డిగ్రీలు కొనసాగింది. గాలిలో తేమశాతం ఉదయం 75 నుంచి 85, మధ్యాహ్నం 30 నుంచి 40 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 8 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో వీచాయి. నాలుగైదు మండలాల్లో తుంపర్లు పడ్డాయి.
తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు
Published Mon, May 29 2017 12:09 AM | Last Updated on Tue, Sep 5 2017 12:13 PM
Advertisement