decrease
-
జీరో బ్రోకరేజీలకు ఇక చెల్లు!
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్ఓ) విభాగంలో చిన్న ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో వారిని ట్రేడింగ్‌కు దూరంగా ఉంచేందుకు సెబీ రంగంలోకి దిగింది. తాజాగా నిబంధనలను మరింత కఠినతరం చేయడంతో జీరో బ్రోకరేజీ సంస్థలకు బాగానే సెగ తగలనుంది. సెబీ చర్యలు అమల్లోకి వస్తే.. డెరివేటివ్స్ వాల్యూమ్స్ పడిపోయి బ్రోకరేజీ కంపెనీల ఆదాయాలకు గండి పడుతుంది. దీంతో జీరో బ్రోకరేజీ ప్లాన్లకు ఇక ‘ఎక్స్పైరీ’ తప్పదంటున్నాయి మార్కెట్ వర్గాలు!డెరివేటివ్ ట్రేడింగ్ విషయంలో సెబీ తీసుకున్న చర్యలతో జీరో బ్రోకరేజీ సంస్థల జోరుకు అడ్డకట్ట పడనుంది. ఎఫ్ అండ్ ఓ విభాగం నుంచి లభించే ఆదాయానికి చిల్లు పడుతుందన్న అంచనాలతో ఏంజెల్ వన్ ‘జీరో బ్రోకరేజీ’కి చెల్లు చెబుతున్నట్లు ప్రకటించింది. క్లయింట్ల సంఖ్య పరంగా దేశంలో మూడో అతపెద్ద బ్రోకరేజీ సంస్థగా ఇది నిలుస్తుండం విశేషం. నవంబర్ 1 నుంచి క్యాష్ మార్కెట్ లావాదేవీలు (షేర్ల కొనుగోలు, అమ్మకం)పై రూ.20 ఫ్లాట్ ఫీజు లేదా టర్నోవర్‌పై 0.1% (ఏది తక్కువైతే అది) ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇప్పటిదాకా ఈ లావాదేవీలపై ఎలాంటి ఫీజులు లేవు. కాగా, రాబోయే రోజుల్లో ఇతర బ్రోకరేజీ సంస్థలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ‘పరిస్థితుల మార్పుతో అతి తక్కువ ఫీజులతో బ్రోకింగ్ పరిశ్రమ నిలదొక్కుకోవడం అంత సులువు కాదు. ముఖ్యంగా డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థలు ఫీజులు పెంచక తప్పదు. ఎందుకంటే అవి ఎఫ్అండ్ఓ వాల్యూమ్స్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. సెబీ నిర్ణయంతో ఆదాయాలకు కోత పడుతుంది’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎండీ ధీరజ్ రెల్లి పేర్కొన్నారు.కొన్నేళ్లుగా హవా... గతంలో ఓ వెలుగు వెలిగిన బ్యాంకింగ్ ‘బ్రోకరేజ్’లకు (ఐసీఐసీ డైరెక్ట్, యాక్సిస్ డైరెక్ట్ వంటివి) జీరోధా, గ్రో వంటి కొత్త తరం బ్రోకరేజీ సంస్థలు భారీగానే గండి కొట్టాయి. ముఖ్యంగా క్యాష్ లావాదేవీలపై జీరో బ్రోకరేజీ, ఎఫ్అండ్ఓ ట్రేడింగ్‌కు అతి తక్కువ చార్జీలు, మార్జిన్లపై లీవరేజీ వంటి ప్రయోజనాలతో బ్యాంకుల వ్యాపారాన్ని కొల్లగొట్టాయి. మరోపక్క, రిటైల్ ఇన్వెస్టర్లు ముఖ్యంగా యువత సరైన అవగాహన లేకుండా, అత్యాశతో ఎఫ్అండ్ఓ ట్రేడింగ్‌లో కుదేలయ్యే పరిస్థితికి దారితీస్తోంది. చిన్న ఇన్వెస్టర్లు డెరివేటివ్స్ ట్రేడింగ్ చేయకుండా సెబీ పలు చర్యలు చేపడుతున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. 2022–24 మధ్య వ్యక్తిగత ట్రేడర్లు సగటున రూ.2 లక్షలు నష్టపోయారని.. రూ.1.8 లక్షల కోట్లు ఆవిరైందని సెబీ అధ్యయనం తేల్చింది. దీంతో ఇంకాస్త కఠిన నిబంధనలు తెచి్చంది. రూ. 2,000 కోట్ల చిల్లు... మార్కెట్ ఇన్ఫ్రా సంస్థలు (ఎంఐఐలు–ఎక్సే్చంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్లు, డిపాజిటరీలు) మెంబర్లకు (బ్రోకర్లు) విధించే ఛార్జీ లతో సమానంగానే కస్టమర్లకు (ఇన్వెస్టర్లు, ట్రేడర్లు) కూడా చార్జీలు ఉండాలని సెబీ ఈ ఏడాది జూలైలో ఆదేశించింది. ప్రస్తుతం అధిక వాల్యూమ్ ఉంటే ఎంఐఐలు బ్రోకర్లకు కొంత డిస్కౌంట్ ఇస్తున్నాయి. ట్రేడర్లకు మాత్రం ఫ్లాట్ రేట్ అమలు చేస్తుండటంతో ఆమేరకు బ్రోకింగ్ కంపెనీలకు లాభం చేకూరుతోంది. అయితే, సెబీ ఏకరీతి చార్జీల నిబంధనల వల్ల బ్రోకరేజీ సంస్థల ఆదాయాల్లో రూ. 2,000 కోట్లకు పైగా చిల్లు పడుతుందని అంచనా. ముఖ్యంగా డిస్కౌంట్ ప్లాట్‌ఫామ్‌లపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు జీరో బ్రోకరేజీ మోడల్స్‌కు తెరపడవచ్చనేది పరిశ్రమ విశ్లేషకుల మాట! ‘ఆదాయంలో 15–20 శాతం కోత ప్రభావంతో చాలా వరకు బ్రోకరేజీలు ఈక్విటీ డెలివరీపై ఫీజు విధించవచ్చు. మధ్య, చిన్న స్థాయి బ్రోకింగ్ కంపెనీలకు ఈ సెగ బాగా తగులుతుంది’ అని ఫైయర్స్ బ్రోకరేజ్ కో–¸ఫౌండర్, సీఈఓ తేజస్ ఖోడే అభిప్రాయపడ్డారు. కాగా, బ్రోకింగ్ దిగ్గజం జీరోధా మాత్రం ప్రస్తుతానికి తాము షేర్ల డెలివరీపై ఎలాంటి ఫీజూ విధించబోమని స్పష్టం చేసింది. ‘మా ఆదాయంలో అత్యధిక భాగం ఇండెక్స్ డెరివేటివ్స్ ద్వారానే వస్తోంది. ఈ విభాగంలో కఠిన నిబంధనల వల్ల ఆదాయంలో 30–50 శాతం తగ్గుదలకు ఆస్కారం ఉంది’ అని జీరోధా ఫౌండర్, సీఈఓ నితిన్ కామత్ పేర్కొనడం విశేషం! సెబీ కీలక మార్పులు... ఇండెక్స్ డెరివేటివ్స్‌లో కాంట్రాక్ట్ కనీస విలువను రూ.15 లక్షలకు (గరిష్టంగా రూ.20 లక్షలు) పెంపు. వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్టుల సంఖ్య కుదింపు, ఇంట్రాడే పొజిషన్ లిమిట్లను తప్పనిసరిగా పర్యవేక్షించడంబ్రోకరేజీలు ఆప్షన్ ప్రీమియంను బయ్యర్ల నుంచి ముందుగానే పూర్తిగా వసూలు చేయడం. డెరివేటివ్స్ ఎక్స్పైరీ రోజున మార్జిన్ల పెంపు, క్యాలెండర్ స్ప్రెడ్ ప్రయోజనాల తొలగింపు. ఆప్షన్స్ ఎక్స్పైరీ రోజున టెయిల్ రిస్క్ కవరేజీ పెంపు. ఈ నిబంధనలు నవంబర్ 20 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 1 వరకు దశల వారీగా అమల్లోకి రానున్నాయి.సెబీ కఠిన నిబంధనల కారణంగా మొత్తం ఎఫ్అండ్ఓ ట్రేడ్స్‌లో 60% మేర ప్రభావం ఉండొచ్చు. మా ప్లాట్ఫామ్లో డెరివేటివ్ ఆర్డర్లు 30% తగ్గుతాయని భావిస్తున్నాం. – నితిన్ కామత్, జీరోధా ఫౌండర్, సీఈఓ – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఢిల్లీలో తగ్గిన పోలింగ్ శాతం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆరవ విడతలో భాగంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. మే 25న జరిగిన ఈ ఎన్నికల్లో రాజధాని వాసులు గతంలో కంటే తక్కువగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఆరవ విడతలో ఓటర్ టర్నవుట్ డేటాను ఈసీ మంగళవారం(మే28) వెల్లడించింది.గతంలో ఢిల్లీలో 60.52 శాతం ఓట్లు పోలైతే ప్రస్తుత ఎన్నికల్లో అది 58.69 శాతానికి తగ్గిపోయింది. ఇక్కడ అత్యధికంగా కన్హయ్యకుమార్, మనోజ్‌తివారీ తలపడిన ఈశాన్య ఢిల్లీలో 62.87 శాతం ఓట్లు పోలవడం గమనార్హం. కన్హయ్యకుమార్ కాంగ్రెస్ నుంచి ఈ ఎన్నికల్లో బరిలో నిలిచారు. ఢిల్లీలో కాంగ్రెస్,ఆప్ కూటమి,బీజేపీ మధ్య ద్విముఖ పోరు జరిగింది.ఢిల్లీలో మొత్తం ఏడు ఎంపీ సీట్లున్నాయి. -
దగ్గరకానున్న చైనా సరిహద్దు.. చమోలి- పితోర్‌గఢ్ రోడ్డు పనులు షురూ!
ఇకపై ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాకు ఆనుకుని ఉన్న చైనా సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ, ఐటీబీపీల కదలికలు మరింత సులభతరం కానున్నాయి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) చమోలిలోని లాప్తాల్ నుండి పితోర్‌గఢ్ వరకు రోడ్డు పనులను ప్రారంభించింది.2028 నాటికి ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని బీఆర్ఓ లక్ష్యంగా పెట్టుకుంది. చమోలీ నుంచి పితోర్‌గఢ్ వరకు ఉన్న 500 కి.మీ. దూరం ఈ రహదారి నిర్మాణంతో 80 కి.మీకి తగ్గనుంది. నీతి లోయలోని చివరి గ్రామమైన నీతిని ఆనుకుని చైనా సరిహద్దు ప్రాంతం ప్రారంభమవుతుంది. ఇక్కడ ఆర్మీ,ఐటీబీపీకి చెందిన ఫార్వర్డ్ పోస్ట్‌లు ఉన్నాయి.ప్రస్తుతం ఈ పోస్ట్‌లు మంచుతో కప్పబడి ఉన్నాయి. ప్రతికూల భౌగోళిక పరిస్థితుల మధ్య బీఆర్ఓ కార్మికులు ఇక్కడ సుమారు 40 కిలోమీటర్ల రహదారి కోసం కొండను కట్ చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. లాప్తాల్ నుండి మిలాం వరకు రోడ్డు కటింగ్ పనులు ప్రారంభించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మూడు నెలలుగా ఈ పనులు నిలిచిపోగా, ఇప్పుడు మళ్లీ ప్రారంభమయ్యాయి.చమోలీకి ఆనుకుని ఉన్న ఈ సరిహద్దు ప్రాంతంలో చైనా రైలు మార్గాన్ని కూడా విస్తరించింది. ఈ ప్రాంతంలోకి చైనా తరచూ చొరబడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఇక్కడ రోడ్డు విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించింది. లాప్తాల్ నుండి మిలామ్ పితోర్‌గఢ్ వరకు రహదారి నిర్మాణం చేపట్టడం ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.గత ఏడాది జూలైలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి, లాప్తాల్ నుంచి మిలామ్ వరకు 30 కిలోమీటర్ల పొడవైన సొరంగ ప్రాజెక్టును ఆమోదించాలని అభ్యర్థించారు. ఈ నిర్మాణం చేపడితే పితోర్‌ఘర్‌లోని జోహార్ లోయ చమోలీకి అనుసంధానమవుతుంది. భవిష్యత్తులో లేహ్ లడఖ్ మాదిరిగా ఇక్కడ కూడా పర్యాటక కార్యకలాపాలను ప్రారంభించే ప్రణాళిక ప్రభుత్వం వద్ద ఉంది. -
ICRA: డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ 6 శాతం
న్యూఢిల్లీ: భారత్ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (2023 అక్టోబర్–డిసెంబర్) 6 శాతానికి తగ్గుతుందని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2023జూలై–సెపె్టంబర్)లో 7.6 శాతంగా ఉన్నట్టు గుర్తు చేసింది. వ్యవసాయం, పరిశ్రమల పనితీరు స్తబ్దుగా ఉన్నట్టు తెలిపింది. పారిశ్రామిక రంగంలో వృద్ధి తగ్గుముఖం పట్టడానికి గతంలో బేస్ ప్రభావం అధికంగా ఉండడానికితోడు, అమ్మకాల పరిమాణం తగ్గడాన్ని ప్రస్తావించింది.. భారత ప్రభుత్వం, 25 రాష్ట్రాల వ్యయాలు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 0.2 శాతం మేర తగ్గడం జీవీఏ వృద్ధిని వెనక్కి లాగడానికి కారణాల్లో ఒకటిగా పేర్కొంది. ‘‘పారిశ్రామిక రంగంలో అమ్మకాల పరిమాణం తగ్గడం, పెట్టుబడులపైనా కొంత స్తబ్దత, ప్రభుత్వ వ్యయాలు తగ్గడం, రుతుపవనాలు అసాధారణం ఉండడం వంటివి జీడీపీ వృద్ధిని 2023–24లో మూడో త్రైమాసికంలో 6 శాతానికి తగ్గిస్తాయి’’అని వివరించింది. ఇక సేవల రంగానికి సంబంధించి జీవీఏ (స్థూల అదనపు విలువ) మాత్రం 2023–24లో రెండో త్రైమాసికంలో ఉన్న 5.8 శాతం నుంచి మూడో త్రైమాసికంలో 6.5 శాతానికి వృద్ధి చెందుతుందని ఇక్రా అంచనా వేసింది. హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్, ప్రసార సేవలు ఇందుకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. -
కృష్ణాలో తగ్గిన వరద
సాక్షి, అమరావతి: పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో కృష్ణానదిలో వరద ప్రవాహం తగ్గింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 82,055 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటిమట్టం 846.7 అడుగులకు పెరిగింది. నీటినిల్వ 73.23 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగులు. పూర్తినిల్వ 215.81 టీఎంసీలు. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 142 టీఎంసీలు అవసరం. కృష్ణా ప్రధానపాయపై ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు ఇప్పటికే నిండుకుండలుగా మారిన నేపథ్యంలో.. ఇకపై కురిసే వర్షాల వల్ల ఆ డ్యామ్‌లలోకి వచ్చే ప్రవాహాన్ని దిగువకు విడుదల చేయాల్సిందే. ఈ నేపథ్యంలో శ్రీశైలంతోపాటు, నాగార్జునసాగర్ కూడా ఆగస్టులో నిండుతాయని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. పులిచింతల ప్రాజెక్టులోకి మూసీ నుంచి 11,755 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 32 టీఎంసీలకు చేరింది. ఈ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 13 టీఎంసీలు అవసరం. మున్నేరు, కట్టలేరు, బుడమేరు తదితర వాగులు, వంకల్లో ప్రవాహం తగ్గడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరుతున్న వరద తగ్గింది. ప్రకాశం బ్యారేజ్‌లోకి 48,696 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో గేట్లద్వారా అధికారులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ నీటి సంవత్సరంలో అంటే జూన్ 1 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ప్రకాశం బ్యారేజ్ నుంచి 46.715 టీఎంసీల కృష్ణా మిగులు జలాలు కడలిలో కలిశాయి. ఇవన్నీ మున్నేరు, కట్టలేరు వరద జలాలే కావడం గమనార్హం. ఇక పశ్చిమ కనుమల్లో వర్షపాత విరామం ఏర్పడటంతో.. కృష్ణా ప్రధానపాయలో ఎగువన వరద మరింత తగ్గింది. ఆల్మట్టిలోకి 1.16 లక్షలు, నారాయణపూర్‌లోకి 60 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో గేట్లను మూసేశారు. ఆ రెండు డ్యామ్‌లలో విద్యుత్‌ను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తూ దిగువకు 55 వేల క్యూసెక్కులను వదిలేస్తున్నారు. జూరాలలోకి వరద ప్రవాహం 63,563 క్యూసెక్కులకు తగ్గడంతో గేట్లను మూసేసి.. విద్యుదుత్పత్తి చేస్తూ 41,252 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం శ్రీశైలంలోకి వచ్చే ప్రవాహం మరింతగా తగ్గనుంది. ఇక కృష్ణా ప్రధాన ఉపనది అయిన తుంగభద్రలోను వరద తగ్గింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 42,376 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 72.36 టీఎంసీలకు చేరుకుంది. ఈ డ్యామ్ నిండాలంటే ఇంకా 33 టీఎంసీలు అవసరం. -
భారీగా తగ్గనున్న రిఫైన్డ్ ఆయిల్ ధరలు..!
-
ఈ ప్రాంత ఆహారంతో మీ మెదడు వయస్సు తగ్గిపోతుంది..!
కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ..జంక్ ఫుడ్‌ను తగ్గిస్తే మన మెదడు మెరుగ్గా పనిచేస్తుందని ఎన్నో నివేదికలు తెలిపాయి. కానీ ప్రస్తుతం ఓ నివేదిక మెదడు వయస్సును తగ్గించే విషయాలను వెల్లడించింది. మధ్యదరా ప్రాంతంలోని ఆహారంతో మెదడు వయస్సు తగ్గుతుందని ఇజ్రాయెల్‌లోని నెగేవ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ నివేదిక స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో సాధారణంగా తీసుకునే కూరగాయలు,సీఫుడ్, తృణధాన్యాల కారణంగా శరీరంలో ఒక శాతం కొవ్వు తగ్గడమే కాకుండా మెదడు పనితీరు మెరుగుపడిందని తెలిపారు. మెదడుకు సాధారణంగా ఉండే వయస్సు కంటే తొమ్మిది నెలలు తగ్గుతుందని పరిశోధనలో తేలినట్లు వెల్లడించారు. 102 మందితో 18 నెలలపాటు ఆ ఆహారాన్ని ఇచ్చి శరీర భాగాల పనితీరును పరిశీలించినట్లు నివేదిక పేర్కొంది. ఈ ఆహారంతో కొత్తగా వచ్చి చేరుతున్న కొవ్వు, బాడీ మాస్ ఇండెక్స్, కాలెయ పనితీరును పరిశీలించగా.. మెదడు పనితీరుపై మెరుగైన ఫలితాలు కనిపించినట్లు వెల్లడించారు. శరీర బరువు కూడా 2.3కిలోగ్రాములు తగ్గినట్లు చెప్పారు. ఆరోగ్యకరమైన జీవనవిధానం వల్ల మెదడుపై మెరుగైన ఫలితాలు ఉంటున్నాయని బెన్ గ్యురియన్ యూనివర్సిటీకి చెందిన న్యూరోసైంటిస్టు గిడోన్ లెవకోవ్ తెలిపారు. ప్రాసెసింగ్ ఫుడ్‌ను తగ్గించడం, స్వీట్లు, జంక్ ఫుడ్స్ మెదడు పనితీరును దెబ్బతీయడమే కాకుండా.. బయోలాజికల్ వయస్సును కూడా పెంచుతున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి:భూమి లోతుల్లో మరో అద్భుత ప్రపంచం -
విప్రోకు ఎదురుదెబ్బ: ఫ్రెషర్ల జీతం కోత అన్యాయమంటూ ఫిర్యాదు
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సంస్థ విప్రో ఇటీవల తీసుకున్న నిర్ణయంపై ఐటీ ఉద్యోగుల సంఘం మండిపడింది. ఒక ప్రోగ్రామ్ కింద ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్లకు జీతాల ఆఫర్లను దాదాపు 50 శాతం తగ్గించే విప్రో చర్య అన్యాయం, అంగీకార యోగ్యం కాదని ఐటీ ఉద్యోగ సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) పేర్కొంది. కంపెనీ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని డిమాండ్ చేసింది. కార్మిక శాఖకు ఫిర్యాదు అంతేకాదు ఈమేరకు ప్రోపై కార్మిక మంత్రిత్వ శాఖకు బుధవారం ఫిర్యాదు చేసింది. విప్రో ఫ్రెషర్ల జీతాన్ని అనైతికంగా తగ్గిస్తోంది, ఇది ఆఫర్ లెటర్ నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘన అని ఫిర్యాదు చేసింది. దీన్ని ఆమోదిస్తే ఇతర కంపెనీలు కూడా దీనిని అనుసరిస్తాయనే ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఉద్యోగుల దోపిడీకి చఉద్యోగ భద్రత లోపానికి దారి తీస్తుందనినైట్స్ ఫిర్యాదులో పేర్కొంది. మరి తాజా పరిణామంపై విప్రో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా విప్రో రూ. 6.5 లక్షల (LPA) ఆఫర్‌తో ఫ్రెషర్లకు ఉద్యోగాల్లోకి తీసుకుంది. అయితే ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, కాస్ట్ కటింగ్ లాంటి సాకులతో వార్షిక వేతనం సగానికి కోత విధించేందుకు నిర్ణయించింది. 3.5 లక్షలకు పనిచేస్తారా అని ఈ మెయిల్ద్వారా వారిని కోరడం వివాదానికి తీసింది.ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తమ వ్యాపార అవసరాలకు తగినట్టుగా నియామకాల్లో సర్దుబాట్లు చేసుకుంటున్నట్టు ఆ మెయిల్లో విప్రో పేర్కొంది. ఈ ఆఫర్‌కు అంగీకరించి వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. అయితే దీనిపై ఐటీ రంగ ఉద్యోగుల సంఘం నైట్స్ స్పందించింది. ఇది అన్యాయమని, ఆమోదించదగ్గ చర్య కాదంటూ తప్పుబట్టింది. ఆన్‌బోర్డ్ కోసం వేచి ఉన్న ఫ్రెషర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని, పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారానికి యూనియన్‌తో అర్థవంతమైన చర్చలు జరపాలని డిమాండ్ చేసింది. -
వాహనదారులకు శుభవార్త.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు
-
వారికి అమెజాన్ పండుగ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ‘అమెజాన్ ఇండియా’ ముఖ్యమైన పండుగల ముందు విక్రేతలకు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. తన ప్లాట్‌ఫామ్‌పై విక్రయాలు నిర్వహించినందుకు చెల్లించాల్సిన ఫీజును 50 శాతం తగ్గిస్తున్నట్టు తెలిపింది. కొత్త వెండర్లకు ఇది వర్తించనుంది. అమెజాన్ ప్లాట్ఫామ్లో విక్రయించే ప్రతీ ఉత్పత్తి విలువలో (కొనుగోలు దారు చెల్లించే) నిర్ణీత శాతం మేర ఫీజుగా వర్తకులు చెల్లించాల్సి ఉంటుంది. ‘‘కొత్త అమ్మకందారులు ప్రస్తుత పండుగల సీజన్లో ఈ–కామర్స్ ప్రయాణాన్ని వెంటనే ఆరంభించేందుకు వీలుగా.. అమెజాన్.ఇన్‌పై ఆగస్ట్ 28 నుంచి అక్టోబర్ 26 మధ్య నమోదు చేసుకుని.. తదుపరి 90 రోజుల్లోపు అమ్మకాలు మొదలు పెట్టడం ద్వారా అమ్మకం ఫీజులో 50 శాతం రాయితీ పొందొచ్చు’’అని అమెజాన్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది వర్తకులు ప్రస్తుత పండుగల డిమాండ్ నుంచి ప్రయోజనం పొందాలనుకుంటున్నట్టు తెలిపింది. ‘‘భారత్ వ్యాప్తంగా మాకు మిలియన్ విక్రేతలు ఉన్నారు. పండుగల సీజన్లో వారంతా తమ ఉత్పత్తులను వినియోగదారుల ముందు ప్రదర్శించే అవకాశం మా వేదిక ద్వారా ఉంటుంది’’అని అమెజాన్ ఇండియా డైరెక్టర్ వివేక్ సోమారెడ్డి వెల్లడించారు. అమెజాన్‌కు దేశవ్యాప్తంగా 60 ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలు, 1850 వరకు స్టేషన్లు (సొంతంగా, భాగస్వాముల ద్వారా) ఉన్నాయి. -
సాక్షి కార్టూన్ 18-02-2022
ఇక మన హింస కాస్త తగ్గిస్తే బెటర్ -
అన్ని శాఖలకు నిధులు తగ్గించాలి..
సాక్షి, హైదరాబాద్ : దేశంపై ఆర్థిక మాంద్యం ప్రభావం లేదని పార్లమెంటు లోపల, బయట కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజూ గొప్పలు చెబుతున్నా వాస్తవాలు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయని సీఎం కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా గణనీయంగా తగ్గిన నేపథ్యంలో అన్ని శాఖలకు సమాంతరంగా నిధులు తగ్గించాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు. రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాపై వాస్తవాలు వెల్లడించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు శనివారం లేఖ రాశారు. కేంద్ర నిధులు రాని పక్షంలో రాష్ట్రం ఎదుర్కొనే ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగ్‌రావు, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పన్నుల వాటాలో రూ. 924 కోట్ల మేర కోత.. ‘2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను తెలంగాణకు పన్నుల వాటా రూపంలో రూ. 19,719 కోట్లు ఇస్తామని బడ్జెట్లో కేంద్రం పేర్కొంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రూ. 18,560 కోట్లతో పోలిస్తే ఇది 6.2 శాతం ఎక్కువ. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గడిచిన 8 నెలల్లో రాష్ట్రానికి అందిన కేంద్ర పన్నుల వాటా రూ. 10,304 కోట్లు మాత్రమే. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే ఎనిమిది నెలల కాలానికి రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన పన్నుల వాటా రూ. 10,528 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది నికరంగా ఇప్పటివరకు రూ. 224 కోట్ల మేర రాబడి తగ్గింది. కేంద్ర బడ్జెట్లో సూచించిన లెక్కల ప్రకారం వాస్తవానికి 6.2 శాతం అధికంగా రావడం పక్కనపెడితే ఈ ఏడాది 2.13 శాతం తగ్గింది. అంటే గత ఆర్థిక సంవత్సరం కంటే రూ. 700 కోట్లు అధికంగా రావాల్సి ఉండగా రూ. 224 కోట్ల మేర కోత పడటంతో రాష్ట్రానికి ఇప్పటివరకు కేంద్ర పన్నుల వాటా మొత్తంగా రూ. 924 కోట్ల మేర తగ్గింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఇటీవలి ఢిల్లీ పర్యటనలో కేంద్ర పన్నుల వాటా 8.3 శాతం తగ్గిన విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వాటాలో రాబడి 15 శాతం మేర తగ్గితే రూ. 2,957 కోట్ల మేర కోత పడుతుంది. అదే జరిగితే రాష్ట్రంలో అనేక పథకాల అమల్లో ఇబ్బందులు ఎదురవుతాయి’అని సీఎం వ్యాఖ్యానించారు. అన్ని శాఖలకు నిధులు తగ్గించండి... ‘అన్న వస్త్రం కోసం వెళ్తే ఉన్న వస్త్రం పోయిన రీతిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనిశ్చితంగా ఉంది. కేంద్ర పన్నుల వాటా రాబడి గణనీయంగా తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని శాఖలకు సమాంతరంగా నిధులు తగ్గించాలి’అని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఖర్చుల తగ్గింపును ఏదో ఒక శాఖకు వర్తింపజేయకుండా అన్ని శాఖల్లోనూ అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్ట విధానం వల్లే ఇలాంటి సంకట స్థితి ఏర్పడిందని సమావేశంలో సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆర్థిక స్థితి దిగజారకుండా స్వీయ నియంత్రణ పాటించడం తప్ప మరో గత్యంతరం లేదని, అన్ని శాఖలను అప్రమత్తం చేసి ఖర్చుల్లో కోత, ఆర్థిక నియంత్రణను కఠినంగా అమలు చేయాలని సీఎం సూచించారు. అధికారులు, మంత్రులు సైతం ఆర్థిక క్రమశిక్షణ పాటించాలన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇతర ఆర్థిక అంశాలపై ఈ నెల 11న జరిగే కేబినెట్ సమావేశంలో మంత్రులు, అధికారులకు సమగ్ర నోట్ అందించాలని ఆర్థిక శాఖ అధికారులను కేసీఆర్ ఆదేశించారు. కేంద్రం తన వాటా నిధులు ఇవ్వకుంటే ఎదురయ్యే ఇబ్బందులను ఐదారు రోజుల్లో ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లే యోచనలోఉన్నట్లు సీఎం వెల్లడించారు. కేంద్ర పన్నుల వాటాను విడుదల చేయండి... కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాను విడుదల చేయాలని, లేనిపక్షంలో వాస్తవాలను విడుదల వెల్లడించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం కేసీఆర్ శనివారం లేఖ రాశారు. ‘2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీలో అంతర్భాగంగా ఉండే ఐజీఎస్టీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ. 2,812 కోట్లకు కూడా కేంద్రం ఎగనామం పెట్టింది. తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఐజీఎస్టీ నిధులను కేంద్రం ఎగ్గొంటిందనే విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. జీఎస్టీ ద్వారా 14 శాతం కంటే తక్కువ రాబడి వచ్చిన రాష్ట్రాలకు నష్టాన్ని పూడుస్తామని జీఎస్టీ చట్టం అమలు సందర్భంగా కేంద్రం అన్ని రాష్ట్రాలకు హామీ ఇచ్చింది. అయితే దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం మూలంగా తెలంగాణ రాష్ట్రానికి 14 శాతం మేర జీఎస్టీ నిధులు సమకూరడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి జీఎస్టీ నష్టపరిహారం కింద రాష్ట్రానికి రావాల్సిన రూ. 1,719 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలి’అని సీఎం కేసీఆర్ లేఖలో కోరారు. -
కొనుగోలు శక్తి తగ్గొచ్చు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈసారి రుతుపవనాలు సాధారణం కంటే మెరుగ్గా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో నీటి లభ్యత పెరిగింది. అయితే నాట్లు ఆలస్యం కావడం, పంట విస్తీర్ణం తగ్గడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయి ఆర్థిక వ్యవస్థ మరింత నెమ్మదించే అవకాశం ఉందని ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ అన్నారు. ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ కాంప్లెక్స్ చాయిసెస్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమైన రెండు రోజుల సదస్సులో ఆయన మాట్లాడారు. ‘వాహన విక్రయాలు గణనీయంగా పడిపోవడాన్ని బట్టి రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతోందో అంచనా వేయొచ్చు. అయితే వాహన రంగంపై ఇటీవల ఎస్బీఐ ఓ అధ్యయనం చేసింది. దాంట్లో తేలిందేమంటే ప్రాంతం, వయసు, లింగ భేదం లేకుండా ఆర్థిక స్తోమతను బట్టి కార్లను కొంటున్నారు. అత్యధికులు ఖరీదైన మోడళ్లను కైవసం చేసుకుంటున్నారు. వీటి కోసం రూ.10 లక్షలకుపైగా ఖర్చు చేస్తున్నారు. ముఖ్య విషయమేమంటే భారత్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్నట్టే.. కార్లను కొంటున్న మహిళలూ అధికమవుతున్నారు. అమెజాన్ సేల్‌లో ఎస్బీఐ కార్డ్ కస్టమర్లు ఖర్చు చేసినదాన్ని బట్టి... ద్వితీయ శ్రేణి నగరాల నుంచీ డిమాండ్ ఉంది. దీనినిబట్టి చూస్తే సెంటిమెంట్ లేకపోతే ఇంత డిమాండ్ ఎలా వచ్చిందనే ప్రశ్న తలెత్తుతోంది’ అని వివరించారు. బంగారం ధరలు తగ్గే సూచనలు ఇప్పట్లో కనపడడం లేదని వ్యాఖ్యానించారు. -
పడిపోతున్న భూగర్భ నీటిమట్టాలు
-
తెలంగాణలో జల ఘంటికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి నీటి ముప్పు ముంచుకోస్తోంది. వేసవి రాక ముందే భూగర్భ జలాలు పాతాళానికి చేరుతున్నాయి. గతేడాది వర్షపాతం లోటుతోపాటు ‘రబీ’ సాగుకు బోరుబావులపై ఆధారపడటంతో భూగర్భ జలాలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ఈ ఏడాది రాష్ట్ర సగటు నీటి మట్టం 11.91 మీటర్లు. గతేడాదితో పోలిస్తే ఇది 1.83 మీటర్ల మేర పతనం కావడం ఆందోళన కలిగిస్తోంది. అవసరానికి మించి బోర్ల ద్వారా నీటిని తోడేస్తుండటంతో నీటి వృథా జరుగుతోందని భూగర్భ జలశాఖ అంచనా వేస్తోంది. భయపెడుతున్న నీటి మట్టాలు... ఈ ఏడాది జనవరి నాటికి రాష్ట్రంలో 852 మిల్లిమీటర్ల వర్షపాతానికిగాను 721 మిల్లిమీటర్లే నమోదైంది. గతేడాదితో పోలిస్తే 15% తక్కువగా రికార్డయింది. 31 జిల్లాలకుగాను 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవగా 16 జిల్లాల్లో లోటు వర్షపాతం నెలకొంది. 284 మండలాల్లో 20% నుంచి 59% వర్షపాతం తక్కువగా నమోదైంది. గతేడాది జనవరిలో 10.08 మీటర్ల రాష్ట్ర సరాసరి నీటిమట్టాలుండగా ఈ ఏడాది జనవరి చివరి నాటికి అది 11.91 మీటర్లకు చేరింది. భూగర్భ జలమట్టాల్లో 1.83 మీటర్ల తగ్గుదల నమోదైంది. ఇవే మట్టాలను 2017తో పోలిస్తే 2.55 మీటర్ల మేర పడిపోయాయి. కేవలం 11 జిల్లాల్లోనే 0.11 మీటర్ల నుంచి 1.56 మీటర్ల మేర పెరుగుదల కనిపించగా 20 జిల్లాల్లో 7.49 మీటర్ల నుంచి 0.17 మీటర్ల వరకు తగ్గాయి. ముఖ్యంగా సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భూగర్భ నీటిమట్టాలు ఊహించని రీతిలో పడిపోయాయి. సంగారెడ్డిలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 7.49 మీటర్ల మేర నీటిమట్టాలు తగ్గాయి. అతిఎక్కువగా సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలో ఏకంగా 44.68 మీటర్లకు భూగర్భ నీటిమట్టం పడిపోవడం గమనార్హం. ఏకంగా 117 మండలాల్లో 20 మీటర్ల దిగువకు వెళ్తేగానే నీరు లభించట్లేదు. ప్రాజెక్టుల్లోనూ క్షీణత.. రక్షణ చర్యలే కీలకం ఇప్పటికే నీళ్లు లేక బోరుబావులు వట్టిపోయాయి. ఉన్న కొద్దిపాటి నీళ్లను ఉపయోగించి రైతులు పంటల సాగు చేస్తున్నారు. దీనికితోడు మంజీరా, సింగూరు, నిజాంసాగర్‌లలో ఇప్పటికే చుక్క నీటి లభ్యత లేకపోగా ఎస్సారెస్పీ, కడెం, లోయర్ మానేరులో నీటి నిల్వలు పడిపోతున్నాయి. ఇక హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఆధారపడ్డ శ్రీశైలంలో నిల్వలు కనీస నీటిమట్టాలకు దిగువకు చేరాయి. 885 అడుగుల మట్టానికిగాను కనీస నీటిమట్టం 834 అడుగులకన్నా తక్కువగా 831.40 అడుగులకు తగ్గిపోయింది. ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు తగ్గడంతో భూగర్భ జలాలు మున్ముందు మరింత క్షీణించే అవకాశం ఉంది. వేసవికి ముందే ఇలాంటి పరిస్థితులు ఉంటే నిండు వేసవిలో ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయన్నది ఆందోళన రేపుతోంది. నీటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల రోజురోజుకూ భూగర్భజలాలు పడిపోతున్నాయి. నీటిని భూమిలోకి ఇంకించడానికి అవసరమైన ప్రాంతాల్లో కాంటూరు కందకాలు, చెక్‌డ్యాంల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. నీరున్న చోట వాటి నిర్మాణాలకు డ్వామా అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నా నీరు లేనిచోట నిర్మించడం లేదు. ఫలితంగా నీటి కోసం ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో నీటి సంరక్షణ చర్యలు అత్యంత మఖ్యమని భూగర్భ జలశాఖ హెచ్చరిస్తోంది. డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా వ్యవసాయ సాగును ప్రోత్సహించాలని, ఐడీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని సూచిస్తోంది. భూగర్భాలు అత్యంత దారుణంగా పడిపోయిన మండలాలు మండలం మట్టం (మీటర్లలో) దౌల్తాబాద్ (సిధ్దిపేట) 44.68 బట్వారం (వికారాబాద్) 41.77 కొల్చారం (మెదక్) 40.10 ఫరూఖ్‌నగర్ (రంగారెడ్డి) 37.70 మిడ్జిల్ (మహబూబ్‌నగర్) 36.55 -
మగపిల్లలున్న తల్లిదండ్రులూ.. బహుపరాక్
మగపిల్లలున్న తల్లిదండ్రులూ.. బహుపరాక్.. విశ్వనగరం దిశగా అడుగుల వేస్తున్న హైదరాబాద్‌లో మీ అబ్బాయికి పెళ్లి చేయడం కష్టంగా మారవచ్చు. భవిష్యత్తులో అమ్మాయిలు దొరకని పరిస్థితి దాపురించనుంది. వధువు కోసం చిన్నపాటి యుద్ధాలే చేయాల్సి రావచ్చు. ఎందుంటే గ్రేటర్ నగరంలో బాలికల నిష్పత్తి అత్యంత దారుణంగా పడిపోతోంది. తాజా సామాజిక –ఆర్థిక సర్వే ఫలితాలు ఇదే సూచిస్తున్నాయి. సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలో బాలికల శాతం రోజురోజుకు గణనీయంగా తగ్గుతోంది. తాజాగా ప్రతి వెయ్యి మందికి బాలురకు బాలికలు 931 మంది మాత్రమే ఉన్నట్టు తేలింది. 2011 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల నిష్పత్తి 1000/954గా ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి–మార్చిలో చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం ఈ నిష్పత్తి 1000/931గా నమోదైంది. అంటే ఐదేళ్లలో దాదాపు 23 శాతం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ‘బేటి బచావో.. బేటి పడావో’ నినాదంతో ఆడపిల్లల సంరక్షణ చర్యలు చేపడుతుంటే.. హైదరాబాద్ మహానగరంలో మాత్రం బాలికల నిష్పత్తి తిరోగమనం ఆందోళన కలిగిస్తోంది. దీంతో సిటీలో మున్ముందు పెళ్లికాని బ్రహ్మచారుల సంఖ్య పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. సిటీలో బాలికల సంరక్షణకు ప్రభుత్వం నడుం బిగించింది. ‘బేటీ బచావో’పై విస్తృత ప్రచారం చేసేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో సాగుతోంది. తాజా తెలంగాణ ప్రభుత్వం బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమానికి సినీనటి రకుల్ ప్రీత్ సింగ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా రంగంలో దింపింది. హైదరాబాద్ నగరంలో బాలికల నిష్పత్తి అతి తక్కువగా ఉండడానికి వెనుకబాటుతనం ఒక్కటే కారణం కాదని మరోమారు రుజువైంది. వెలుగు చూస్తున్న లింగ వివక్ష... ప్రపంచ పటంలో సాంకేతిక పరంగా అరుదైన గుర్తింపు దక్కించుకున్న హైదరాబాద్‌లో లింగ వివక్ష కొనసాగుతోంది. బాలికల పట్ల చిన్నచూపు, లింగనిర్ధారణ పరీక్షలు, అమలుకాని పీసీపీఎన్డీటీ యాక్ట్, మగపిల్లవాడు పుడితే రెండో బిడ్డకి నో చెప్పడం వంటివి ప్రస్తుత పరిస్థితులకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. గత ఏడాది అప్పటి హైదారబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ఏకంగా గర్భిణులకు లేఖ రాశారు. ‘ఏమో..! మీ కడుపున ఒక సానియానో.. మరో సింధునో, సాక్షినో పుట్టొచ్చుకదా.! ఆడ పిల్లల్ని రక్షించుకుందాం.. చదివించుకుందాం..! ఆడ పిల్లని తెలిస్తే అబార్షన్ చేయించుకోవడం నేరమే కాకుండా.. ఆడవారై ఉండి ఆడపిల్లల పట్ల అన్యాయం చేసిన వారవుతారు’ అంటూ అందులో పేర్కొన్నారు. బాలికల సంఖ్య పెంచేందుకు చర్యలు సిటీలో బాలికల సంఖ్య పెంచేందుకు జిల్లా శిశు సంక్షేమ శాఖ ప్రతేక్యక చర్యలు చేపట్టింది. బేటీ బచావో– బేటీ పడావో కార్యక్రమానికి 18 మందితో టాస్క్‌పోర్స్ ఏర్పాటు చేసింది. వీరు ఆస్పత్రుల్లో అమ్మాయి పుడితే మిఠాయిలు పంచడం, అంగన్వాడి కేంద్రాల్లో ప్రతి మూడో శనివారం ఆ నెలలో పుట్టిన ఆడపిల్లలకు పుట్టిన రోజు వేడుకలు చేస్తున్నారు. తల్లులతో కేట్ కట్ చేయించి శుభాకాంక్షలు చెబుతున్నారు. గర్భిణులకు సామూహిక సీమంతం సైతం చేస్తున్నారు. రాఖీ పండగ రోజు బేటీ బచావో–బేటీ పడాలో అంటూ అంగన్వాడీ పరిధిలోని ప్రముఖుల నుంచి గవర్నర్ వరకు రాఖీలు కట్టారు. తాజాగా సినీనటిని రంగంలో దింపారు. బేటీ బచావోపై అవగాహన... ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి, కన్నవారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఆడపిల్లలను ఆదర్శంగా తీసుకోవాలి. బాలికలను రక్షించుకోకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. హైదరాబాద్‌లో బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్నాం. ఆడపిల్లల ప్రాముఖ్యతను చాటుతున్నాం. – మహ్మద్ ఇంతియాజ్ రహీమ్, బేటీ బచావో–బేటీ పడావో సమన్వయకర్త -
టమాట ధర ఢమాల్
కిలో రూ.80 నుంచి రూ.50కి పడిపోయిన రేటు పెరిగిన వంకాయల ధరలు తాడేపల్లిగూడెం : ఠారెత్తించిన టమాటా ధరలు ఆదివారం ఒక్కసారిగా పతనమయ్యాయి. సుమారు నాలుగు వారాల పాటు మార్కెట్‌ను ధరల దరువుతో కుదిపేసిన టమాటాలు సెంచరీ మార్కుకు చేరువయ్యే అంత సీన్ క్రియేట్ చేశాయి. రూ.80 వద్ద స్థిరంగా ఉండి వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అలాంటి టమాట ఒక్కసారిగా రిటైల్ మార్కెట్లో కిలో రూ.50కు పడిపోయింది. గుత్తగా 25 కిలోల ట్రే ధర రూ.900 రూపాయలకు పతనమైంది. అంతే కాకుండా సరుకులో నాణ్యత లేకపోతే ట్రే ధర రూ.400లే. దీంతో ఈ ప్రభావం రిటైల్ మార్కెట్‌పై పడింది. ధరలు మరింతగా దిగివచ్చాయి. కిలో 50 రూపాయలకే సరుకు దొరికింది. ఇదిలా ఉంటే వంకాయలు ధర ఒక్కసారిగా రయ్‌మంది. పది కిలోలు ఏకంగా 400 రూపాయలకు చేరుకుంది. విడిగా కిలో రూ.60కు అమ్మారు. నల్లవంకాయల ధర 40 రూపాయలకు చేరింది. ఆవపాడు నుంచి వచ్చే చిక్కుడు కాయల ధర కిలో 120 రూపాయలు పలికింది. గిద్దలూరు నుంచి వచ్చే చిక్కుళ్ల ధర కిలో 50 రూపాయలుంది. దోసకాయలు కిలో 30, దొండ కాయలు 24, కంద 40, పెండ్లం 30, మిర్చి 50, బీటురూట్,క్యారట్ 40రూపాయలకు విక్రయించారు. క్యాప్సికం 80, బీన్స్ వంద, క్యాబేజీ 20, చామ 40 రూపాయలకు అమ్మారు. కూరగాయల ధరలలో ఎగుడుదిగుడులు కనిపించాయి. కర్నూలు ఉల్లి.. ధరలో ఘాటు గుత్తా మార్కెట్లో క్వింటా రూ.1500 విడిగా మార్కెట్లో కిలో రూ.18 30 టిపిసి 21 : మార్కెట్‌కు వచ్చిన కర్నూలు ఉల్లిపాయలు కర్నూలు ఉల్లిపాయల సీజన్‌కు ఆదివారం వ్యాపారులు శ్రీకారం చుట్టారు. ముహూర్తాల ప్రకారం వ్యాపారులు లాంఛనంగా కర్నూలు నుంచి ఉల్లిపాయల లారీలను మార్కెట్‌కు తీసుకొచ్చారు. ఆదిలోనే కర్నూలు ఉల్లిపాయల ధరలు దడను సృష్టించాయి. క్వింటాలు ధర గుత్త మార్కెట్లో 1500 రూపాయల వరకు పలికింది. విడిగా కిలో ఈ రకం ఉల్లిపాయలు 18 రూపాయల నుంచి 20 రూపాయల వరకు వ్యాపారులు అమ్మారు. ప్రస్తుతం మార్కెట్ అవసరాలను మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలు తీరుస్తున్నాయి. అవసరాల నిమిత్తం వ్యాపారులు ఉల్లిపాయలను కొనుగోలు చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఉల్లిపాయలు కుళ్లిపోయాయి. దీంతో వ్యాపారులు వారం రోజుల క్రితం వరకు తీవ్ర నష్టాలను చవిచూశారు. కిలో పది రూపాయల కంటే కిందకు పెట్టి ఉల్లిపాయలను విక్రయించారు. కర్నూలు సీజన్ ప్రారంభం కావడంతో ఉల్లిపాయలు ఇక్కడి మార్కెట్‌కు ఆదివారం నుంచి వస్తున్నాయి. తొలుత క్వింటాలు 1400 రూపాయలు పలికిన ఉల్లిపాయలు ఆ తర్వాత 1500 రూపాయలకు ఎగబాకాయి. సరుకు నాణ్యతను బట్టి ఈ ధర వెళ్లింది. పాత ఉల్లిపాయల ధర క్వింటాలు 1600 నుంచి 1700 రూపాయలు పలుకగా విడిగా కిలో 20 రూపాయలకు విక్రయించారు. -
తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు
అనంతపురం అగ్రికల్చర్ : మూడు నెలల తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గత నాలుగైదు రోజులుగా వాతావరణంలో స్వల్పంగా మార్పులు చోటు చేసుకోవడం, ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ తొలకరి జల్లులు పడటం, గాలివేగం పెరగడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గాయి. అయితే ఉక్కపోత, వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. మొత్తమ్మీద 42 నుంచి 45 డిగ్రీల రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలతో సతమతమైన ‘అనంత’ జనం ఇపుడిపుడే కొంత ఉపశమనం పొందుతున్నారు. ఆదివారం గుమ్మగట్టలో 40.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శింగనమల 39 డిగ్రీలు, తాడిమర్రి 38.4 డిగ్రీలు, అనంతపురం 38.2 డిగ్రీలు, గార్లదిన్నె 36.8 డిగ్రీలు, కూడేరు, రాప్తాడు 36.5 డిగ్రీలు.. ఇలా అన్ని మండలాల్లోనూ 34 నుంచి 36 డిగ్రీల మధ్య నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 24 నుంచి 26 డిగ్రీలు కొనసాగింది. గాలిలో తేమశాతం ఉదయం 75 నుంచి 85, మధ్యాహ్నం 30 నుంచి 40 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 8 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో వీచాయి. నాలుగైదు మండలాల్లో తుంపర్లు పడ్డాయి. -
‘పట్టు’ సడలుతోంది!
– రోజురోజుకూ తగ్గుతున్న మల్బరీ సాగు – ఆందోళనలో చేనేత వర్గం ఒకప్పుడు ఎంతో కళకళలాడిన చేనేత నేడు చతికిల పడింది! పట్టు ధరలు నిలకడగాలేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జిల్లాలో పట్టు సాగు గణనీయంగా తగ్గుతుండడంతో ఈభారం కాస్తా చేనేత కార్మికులపై పడుతోంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ఎన్నో అపసోపాలు పడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. క్షేత్ర స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు. ప్రధానంగా పట్టు రైతులను ఆదుకుంటే దాదాపు పట్టు కార్మికులు కూడా సంక్షోభం నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. అయితే ఆ దిశగా ప్రభుత్వం స్పందించకపోవడం గమనార్హం. - ధర్మవరం ఒకప్పుడు ఏ గ్రామానికి వెళ్లినా.. కనీసం వంద ఎకరాలకు తగ్గకుండా జిల్లా అంతటా మల్బరీ పంటను సాగు చేసేవారు. అయితే రానురాను మల్బరీ రైతులకు ప్రోత్సాహాకాలను అందించడంలో ప్రభుత్వం విఫలం కావడంతో పాటు వర్షాభావ పరిస్థితులతో వరుస నష్టాలను ఎదుర్కొన్న అన్నదాతలు మల్బరీ సాగు నుంచి వైదొలుగుతూ వచ్చారు. దశాబ్దం క్రితం జిల్లాలో సాగు అయ్యే మల్బరీ నుంచి తీసిన పట్టుతో ఇక్కడి చేనేత కార్మికులకు చేతినిండా పని దొరికేది. ఫలితంగా ఇతర ప్రాంతాలనుంచి దిగుమతులు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. రానురాను ప్రభుత్వం మల్బరీ రైతులను పట్టించుకోకపోవడంతో వాణిజ్య పంటలపై దృష్టి సారించారు. ఫలితంగా నేడు పట్టు ఉత్పత్తి మన జిల్లాలోనే కాకుండా రాష్ట్రం, దేశంలో కూడా గణనీయంగా తగ్గిపోయింది. దీంతో చైనా పట్టుకు డిమాండ్ పెరిగింది. 20 వేల నుంచి 2 వేల ఎకరాలకు! మల్బరీ పంట సాగు చేయడమంటే కత్తిమీద సాము చేయడమే. ఒక్కొక్కసారి పట్టు పురుగులు పెంచే సమయంలో సెకన్లలో పంట తుడిచి పెట్టుకుపోయే ప్రమాదం ఉంది. వాతావారణ పరిస్థితులు అనుకూలించకుంటే రెండు నెలల పాటు కష్టపడి పెంచిన పంటంతా సెకన్లలో దిబ్బలోకి వేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇలాంటి సమయంలో ఇటు పెట్టుబడులతో పాటు అటు కష్టం అంతా వృధా అవుతోంది. దీంతో రైతులు చాలావరకు మల్బరీ సాగుకు దూరమవుతున్నారు. ధర్మవరం డివిజన్ పరిధిలో నాలుగేళ్ల క్రితం వరకు 20 వేల ఎకరాల్లో సాగు అవుతున్న మల్బరీ పంట.. ప్రస్తుతం రెండు వేల ఎకరాలకు చేరుకుంది. మల్బరీ సాగుపై దృష్టి సారించేలా రైతులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం విఫలమవ్వడంతోనే ఈ దుస్థితి నెలకొంది. రైతులకు అందని ప్రోత్సాహం మల్బరీ పంట సాగు చేయాలనుకునే రైతులకు పలు రకాల సబ్సిడీలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తున్నప్పటికీ వాటిని ఆచరణలో పెట్టడం లేదన్న విమర్శలున్నాయి. మల్బరీ సాగుదారులకు తొలి విడతగా రేషం రూ.10వేలు విలువ చేసే పుల్లతో పాటు రేషం షెడ్డు, చంద్రికలు, శాఖీ పురుగులు తదితర వాటికి కలిపి సుమారు రూ.1.50 లక్షల మేర సబ్సిడీలు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికీ మల్బరీ సాగు పంటపై ఆధారపడి జీవిస్తున్న వారిలో సగం మందికి కూడా ఈ సబ్సిడీలు అందడం లేదనేది నగ్న సత్యం. మల్బరీ సాగులో నష్టపోయిన రైతులను గుర్తించి పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటే కొంత మేర ఊరటగా ఉంటుంది. ఫలితంగా మల్బరీ సాగు పెరిగే అవకాశమూ ఉంది. దిగుమతి ఖర్చుకన్నా తక్కువే ప్రస్తుతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న రేషంకు కోట్లాది రూపాయలను సుంకం రూపంలో చెల్లించాల్సి వస్తోంది. చైనా పట్టుకు ఇంత భారీగా సుంకం చెల్లించి కొనేదానికన్నా.. మన రాష్ట్రంలోని రైతులకు మరిన్ని సబ్సిడీలు ఇవ్వడం ద్వారా ఖర్చు తక్కువగానే ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. మల్బరీ సాగు చేసే ప్రతి రైతు వద్దకెళ్లి సబ్సిడీలు నేరుగా అందేలా చర్యలు తీసుకుంటే ఇక్కడే పట్టు ఉత్పత్తి భారీగా పెరిగే అవకాశమూ ఉంది. ఫలితంగా నాణ్యమైన పట్టు ఉత్పత్తితో పాటు చేనేత రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించినట్లవుతుంది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడితే అన్నదాత ఇంట సిరులు కురిసినట్లే. -
మన్యంలో పెరిగిన చలితీవ్రత
విశాఖ: మన్యంలో చలితీవ్రత రోజు రోజుకు ఎక్కువవుతోంది. లంబసింగిలో 6 డిగ్రీలు, వినుమలూరులో 7 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీలు, చింతపల్లిలో 10 డిగ్రీలు అరకులో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాన్ని పొగమంచు కమ్మేయడంతో.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది. దీంతో పర్యాటకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
దేశంలో బంగారానికి డిమాండ్ డౌన్..
• అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో 28 శాతం తగ్గుదల • టన్నుల రూపంలో 195 టన్నులుగా నమోదు... • ప్రపంచవ్యాప్తంగా 10 శాతం పతనం! ముంబై: మూడవ త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో భారత్ పసిడి డిమాండ్ భారీగా 28 శాతం పడిపోరుుంది. 195 టన్నులుగా నమోదరుు్యంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో డిమాండ్ 271 టన్నులు. ఇక డిమాండ్‌ను విలువ రూపంలో చూస్తే- 12 శాతం పడిపోరుు రూ.66,660 కోట్ల నుంచి రూ.55,970 కోట్లకు చేరింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) మంగళవారం విడుదల చేసిన ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యారుు. అధిక ధరలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితులు అంతగా మెరుగుపడకపోవడం, నియంత్రణా పరమైన చర్యలు, తత్సంబంధ పరిశ్రమ సమ్మె వంటి అంశాలు డిమాండ్ పడిపోవడానికి కారణమని నివేదిక వివరించింది. ఎకై ్సజ్ సుంకం పెంపు, పాన్ వినియోగ నిబంధన వంటివి నియంత్రణా పరమైన అంశాలని డబ్ల్యూజీసీ ఎండీ సోమసుందరం తెలిపారు. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ వల్ల 4వ త్రైమాసికంలో పరిస్థితి మెరుగుపడవచ్చన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆర్థిక సంవత్సరం మొత్తంగా (2016 ఏప్రిల్ - 2017 మార్చి) డిమాండ్ 650 టన్నుల నుంచి 750 టన్నుల వరకూ ఉంటుందన్నది తమ అంచనాగా తెలిపారు. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ⇔ మూడవ త్రైమాసికంలో ఆభరణాలకు డిమాండ్ 28 శాతం తగ్గి 214 టన్నుల నుంచి 155 టన్నులకు పడిపోరుుంది. విలువ రూపంలో 12 శాతం పడిపోరుు రూ.50,270 కోట్ల నుంచి రూ.44,450 కోట్లకు చేరింది. ⇔ పెట్టుబడుల డిమాండ్ 30 శాతం తగ్గి, 57 టన్నుల నుంచి 40 టన్నులకు చేరింది. విలువలో ఇది 14 శాతం పడిపోరుు రూ.13,390 కోట్ల నుంచి రూ.11,520 కోట్లకు చేరింది. ⇔ ఇక రీసైకిల్డ్ గోల్డ్ 114 శాతం పెరిగి రూ.18 టన్నుల నుంచి రూ.39 టన్నులకు చేరింది. ప్రపంచవ్యాప్త డిమాండ్ 993 టన్నులు... ఇదిలాఉండగా, ప్రపంచవ్యాప్తంగా క్యూ3లో పసిడి డిమాండ్ 10 శాతం పడిపోరుు 993 టన్నులకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ పరిమాణం 1,105 టన్నులు. పెట్టుబడులకు సంబంధించి ఈ డిమాండ్ 44 శాతం పెరుగుదలతో 336 టన్నులకు చేరింది. -
పరిశ్రమలు.. మైనస్‌లోనే!
• ఆగస్టులో పారిశ్రామికోత్పత్తి 0.7 శాతం క్షీణత • జూలైలో ఉత్పాదకత మైనస్ 2.49 శాతం • తయారీ, మైనింగ్, యంత్రపరికరాల • రంగాల పేలవ పనితీరు ప్రభావం... న్యూఢిల్లీ: పరిశ్రమల తిరోగమనం కొనసాగుతోంది. వరుసగా రెండో నెలలోనూ మైనస్‌లోనే నిలిచాయి. ఆగస్టులో పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 0.7% క్షీణించింది. ప్రధానంగా తయారీ, మైనింగ్, యంత్రపరికరాల రంగాల ఉత్పాదక పేలవంగా ఉండటమే దీనికి కారణం. జూలైలో ఐఐపీ మైనస్ 2.49%గా(సవరించిన గణాంకాలు) నమోదైంది. ఇది 8 నెలల కనిష్టస్థాయి. రంగాలవారీగా చూస్తే... తయారీ: ఆగస్టులో ఈ రంగం ఉత్పాదకత 0.3 శాతం క్షీణించింది. క్రితం ఏడాది ఇదే నెలలో 6.6 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ఐఐపీలో తయారీ రంగం వాటా 75 శాతం కావడం గమనార్హం. యంత్రపరికరాలు: ఉత్పాదకత ఆగస్టులో అత్యంత ఘోరంగా 22.9% క్షీణించింది. క్రితం ఏడాది ఇదే నెలలో 21.3 శాతంగా నమోదైంది. మైనింగ్: 4.5% వృద్ధి నుంచి 5.6 శాతం క్షీణతలోకి జారిపోయింది. విద్యుత్: ఉత్పాదకత వృద్ధి 5.6 శాతం నుంచి 0.1 శాతానికి తగ్గింది. కన్జూమర్ గూడ్స్: ఈ రంగంలో ఉత్పాదకత వృద్ధి 6 శాతం నుంచి 1.1 శాతానికి పడిపోయింది. ఇందులో విభాగాలైన కన్జూమర్ డ్యూరబుల్స్ 2.3 శాతం వృద్ధి చెందగా.. మొత్తం తయారీ రంగంలోని 22 పరిశ్రమ గ్రూపులలో 7 గ్రూప్‌ల ఉత్పాదకత ఆగస్టులో మైనస్‌లోనే ఉండటం గమనార్హం. ఏప్రిల్-ఆగస్టులో ఇలా...: ఈ ఆర్థిక సంవత్సరం(2016-17) తొలి 5 నెలలకు(ఏప్రిల్-ఆగస్ట్) చూస్తే... పారిశ్రామికోత్పత్తి ఉత్పాదకత మైనస్‌లోనే ఉంది. 0.3% క్షీణించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఐఐపీ 4.1% వృద్ధి చెందింది. ప్రోత్సాహకాలు కావాలి...: కార్పొరేట్లు వినిమయ ఆధారిత డిమాండ్‌ను పెంచడంద్వారా కొత్త పెట్టుబడులను ఆకర్షించాలంటే ప్రభుత్వం పరిశ్రమలకు పోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని కార్పొరేట్ ఇండియా కోరింది. ఐఐపీ వరుసగా రెండో నెలలోనూ క్షీణించిన నేపథ్యంలో పారిశ్రామిక వర్గాలు తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేశాయి. యంత్రపరికరాల రంగం ఉత్పాదకత ఘోరంగా క్షీణించడాన్ని చూస్తే.. పెట్టుబడులు నిలిచిపోయిన బలమైన సంకేతాలకు నిదర్శనమని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు. తయారీ రంగం తిరోగమనం, విద్యుదుత్పత్తి వృద్ధి తగ్గడం కూడా ఆందోళనకలిగించే అంశమేనని.. 7.6 శాతం జీడీపీ వృద్ధి లక్ష్యానికి ఇది పెనుసవాలుగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. వినిమమ డిమాండ్‌ను పెంచడానికి కొన్ని కీలక చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. దీనివల్ల కొత్త పెట్టుబడులకు అవకాశం ఉంటుందన్నారు. కాగా, ఖరీఫ్ పంట దిగుబడులు రికార్డు స్థాయిల్లో నమోదవుతాయన్న అంచనాల నేపథ్యంలో రానున్న నెలల్లో డిమాండ్ భారీగా పుంజుకోవచ్చని భావిస్తున్నట్లు ఇక్రా వైస్ ప్రెసిడెంట్, సీనియర్ ఎకనమిస్ట్ అదితి నాయర్ పేర్కొన్నారు. -
తగ్గుతున్న గోదావరి
ఏటూరునాగారం : ఎగువ ప్రాంతాల్లో చేరుతున్న నీరు తగ్గుముఖం పట్టడంతో గోదావరి శాంతించింది. మంగళవారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద ఉదయం 7 గంటలకు 7.42 మీటర్లు నీటిమట్టం చేరుకోగా మధ్యాహ్నం 2 గంటలకు 7.20 మీటర్లకు పడిపోయింది. దీంతో లోతట్టు గ్రామాల ప్రజలు, రైతులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ముల్లకట్ట, రామన్నగూడెం పుష్కరఘాట్లకు ఆనుకొని గోదావరి ప్రవహిస్తోంది. రాంనగర్- రామన్నగూడెం మధ్యలోని లోలెవల్ కాజ్వే పైనుంచి నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు ప్రజల రాకపోకలకు పడవ ఏర్పాటు చేశారు. గోదావరి వచ్చినప్పుడల్లా తమకు ఈ బాధలు తప్పడం లేదని ఆ గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్‌ను ఆర్డీఓ మహేందర్‌జీ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. గోదావరి వరద ఎంత మేర తగ్గిందని కేంద్ర జలవనరుల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వీఆర్ఓ, వీఆర్ఏ, గ్రామ పంచాయతీ సిబ్బంది ఘాట్ వద్ద ఉంటూ గోదావరి వరద ఉధృతిని పరిశీలించి తనకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఆయనవెంట తహశీల్దార్ నరేందర్, ఆర్ఐ సర్వర్‌పాషా, వీఆర్ఓలు నర్సయ్య, రాములు, మల్లేశం ఉన్నారు. -
పాల..వెలవెల
ప్రభుత్వ డెయిరీకి గడ్డుకాలం సేకరణ 15వేల లీటర్లకు పడిపోయిన వైనం అబ్బో ఎంత తేడా..వేల లీటర్ల సేకరణ పడిపోతుందా..? నెలనెలా గణనీయంగా తగ్గుతున్నా పట్టింపు ఉండదా..? ఇలా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఖమ్మంలోని ప్రభుత్వ డెయిరీ దైన్యం చూస్తుంటే. రోజుకు 25వేల లీటర్ల పాలు సేకరించిన స్థాయి నుంచి ఇప్పుడు 5వేల లీటర్లకు పడిపోవడం చర్చనీయాంశమవుతోంది. ప్రణాళిక లేకనా..? పట్టింపు కరువయ్యా..? అనే సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ప్రోత్సాహకం నిలిచి..పాడి రైతులు క్రమంగా దూరమయ్యాక ఇప్పుడు బాధ్యులు మేల్కొంటున్న దుస్థితి నెలకొంది. ఖమ్మం వ్యవసాయం: జిల్లా కేంద్రం ఖమ్మంలోని ప్రభుత్వ (విజయ) డెయిరీ పాల సేకరణ పడిపోయి వెలవెలబోతోంది. కొన్ని నెలల క్రితం వరకు 25 వేల లీటర్ల పాలు సేకరించిన ఈ యూనిట్ ప్రస్తుతం 5 వేల లీటర్ల సేకరణకు ఖమ్మం రోటరీనగర్‌లోని 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ పాట్లు పడుతోంది. పరిశ్రమ, ప్లాంట్ నిర్వహణకు 45 మంది ఉద్యోగులు(ప్రభుత్వ, అవుట్ సోర్సింగ్) పనిచేస్తున్నా, జిల్లాలో 240 పాల సేకరణ కేంద్రాలున్నా ఇలా ఎందుకు జరిగిందంటే జవాబు లేదు. గతంలో 6 వేల మంది రైతులు నిత్యం పాలు పోసేవారు. గ్రాఫ్..డమాల్ – ఈ ఏడాది జనవరిలో జిల్లా పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ 21 వేల లీటర్ల పాలను సేకరించింది. – ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా స్వల్పంగా తగ్గినా అంతే స్థాయిలో పాల సేకరణ జరిగింది. – ఆయా నెలల్లో లీటరు రూ.4ల ప్రోత్సాహకం పాల బిల్లులతో పాటు వచ్చాయి. – ఏప్రిల్ నెల నుంచి వరుస నెలల్లో పాల సేకరణ పడిపోయింది. – ఆగస్టు నాటికి నిత్యం 5 వేల లీటర్లు మాత్రమే రైతులు ప్రభుత్వ డెయిరీకి పాలు పోస్తున్నారు. ప్రోత్సాహకం లేదు.. పాలు రావట్లేదు.. పాలు పోసే రైతులకు ప్రభుత్వం లీటరు ఒక్కంటికి రూ.4ల చొప్పున ప్రోత్సాహం చెల్లిస్తామని ప్రకటించింది. 2014 నుంచి అందించినా..ఈ ఏడాది మార్చి తర్వాత విధానపరమైన మార్పులతో రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ సొమ్ము రైతుల బ్యాక్ ఖాతాల్లో జమ చేయాల్సి ఉండగా..ఆచరణలో లోపాలతో రైతులు అసౌకర్యం చెందారనే అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో ఏప్రిల్ నుంచి ఐదు నెలల ప్రోత్సాహకాలు అందట్లేదు. జిల్లా రైతులకు రూ.52 లక్షలు బకాయిలు రావాల్సి ఉంది. ఈ కారణంగా కూడా వేలాది మంది రైతులు దూరమవుతున్నారు. పాల కోసం..ఊళ్లకు పయనం ప్రభుత్వ డెయిరీకి పాలు పోయాలని, ప్రోత్సాహకాలు అందుతాయని వివరిస్తూ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ సామినేని హరిబాబు, నూతనంగా బాధ్యతలు చేపట్టిన సంస్థ ఉప సంచాలకులు క్రొవ్విడి కామేష్రావులు ఊరూరా తిరుగుతున్నారు. ఖమ్మం, పాలేరు నియోజక వర్గాల్లో చైర్మన్ తిరుగుతండగా, ఉపసంచాలకులు జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ, రైతులను కలుస్తూ అభ్యర్థిస్తున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన వర్షపాతం
విజయవాడ సెంట్రల్ : ఈ నెలలో రాష్ట్ర సగటు వర్షపాతం బాగా తగ్గిందని జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. పుష్కర భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రకాశం బ్యారేజీ వద్ద 11.1 అడుగుల నీటి మట్టాన్ని ఉంచామని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల్లో సాధారణ వర్షపాతం 111.1 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా 21 ఎం.ఎం మాత్రమే నమోదైందని మంత్రి చెప్పారు. జూన్‌లో 97 మి.మీ. కురవాల్సి ఉండగా 153 మి.మీలు, జులైలో 151 మి.మీ. గాను 121 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. నాగార్జున సాగర్ నుంచి కృష్ణా, పోలవరం నుంచి గోదావరి జలాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. డెల్టా కాలువలకు 16 వేల క్యూసెక్కులు కృష్ణాడెల్టాలోని కాల్వలకు నీరు వదిలిన దృష్ట్యా పర్యవేక్షణ కోసం పుష్కర విధుల్లో ఉన్న ఇరిగేషన్, వ్యవసాయశాఖల అధికారుల్ని రిలీవ్ చేసినట్లు పేర్కొన్నారు. డెల్టా చివరి భూముల వరకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 16,001 క్యూసెక్కుల నీటిని కాల్వలకు విడుదల చేసినట్లు తెలిపారు. మేయర్ కోనేరు శ్రీధర్, డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణరావు పాల్గొన్నారు.