దేశంలో బంగారానికి డిమాండ్ డౌన్..
• అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో 28 శాతం తగ్గుదల
• టన్నుల రూపంలో 195 టన్నులుగా నమోదు...
• ప్రపంచవ్యాప్తంగా 10 శాతం పతనం!
ముంబై: మూడవ త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో భారత్ పసిడి డిమాండ్ భారీగా 28 శాతం పడిపోరుుంది. 195 టన్నులుగా నమోదరుు్యంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో డిమాండ్ 271 టన్నులు. ఇక డిమాండ్‌ను విలువ రూపంలో చూస్తే- 12 శాతం పడిపోరుు రూ.66,660 కోట్ల నుంచి రూ.55,970 కోట్లకు చేరింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) మంగళవారం విడుదల చేసిన ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యారుు. అధిక ధరలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితులు అంతగా మెరుగుపడకపోవడం, నియంత్రణా పరమైన చర్యలు, తత్సంబంధ పరిశ్రమ సమ్మె వంటి అంశాలు డిమాండ్ పడిపోవడానికి కారణమని నివేదిక వివరించింది.
ఎకై ్సజ్ సుంకం పెంపు, పాన్ వినియోగ నిబంధన వంటివి నియంత్రణా పరమైన అంశాలని డబ్ల్యూజీసీ ఎండీ సోమసుందరం తెలిపారు. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ వల్ల 4వ త్రైమాసికంలో పరిస్థితి మెరుగుపడవచ్చన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆర్థిక సంవత్సరం మొత్తంగా (2016 ఏప్రిల్ - 2017 మార్చి) డిమాండ్ 650 టన్నుల నుంచి 750 టన్నుల వరకూ ఉంటుందన్నది తమ అంచనాగా తెలిపారు.
కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
⇔ మూడవ త్రైమాసికంలో ఆభరణాలకు డిమాండ్ 28 శాతం తగ్గి 214 టన్నుల నుంచి 155 టన్నులకు పడిపోరుుంది. విలువ రూపంలో 12 శాతం పడిపోరుు రూ.50,270 కోట్ల నుంచి రూ.44,450 కోట్లకు చేరింది.
⇔ పెట్టుబడుల డిమాండ్ 30 శాతం తగ్గి, 57 టన్నుల నుంచి 40 టన్నులకు చేరింది. విలువలో ఇది 14 శాతం పడిపోరుు రూ.13,390 కోట్ల నుంచి రూ.11,520 కోట్లకు చేరింది.
⇔ ఇక రీసైకిల్డ్ గోల్డ్ 114 శాతం పెరిగి రూ.18 టన్నుల నుంచి రూ.39 టన్నులకు చేరింది.
ప్రపంచవ్యాప్త డిమాండ్ 993 టన్నులు...
ఇదిలాఉండగా, ప్రపంచవ్యాప్తంగా క్యూ3లో పసిడి డిమాండ్ 10 శాతం పడిపోరుు 993 టన్నులకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ పరిమాణం 1,105 టన్నులు. పెట్టుబడులకు సంబంధించి ఈ డిమాండ్ 44 శాతం పెరుగుదలతో 336 టన్నులకు చేరింది.