ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం బుధవారం ఉదయం 49.5 అడుగులకు చేరింది.
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కాస్త తగ్గింది. నీటిమట్టం బుధవారం ఉదయం 49.5 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. మంగళవారం సాయంత్రం నీటిమట్టం 52.4 అడుగులకు చేరిన విషయం తెలిసిందే. రాత్రికి రాత్రి నీటి మట్టం తగ్గడంతో అధికారులు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.