తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: కొద్దిరోజులుగా కొండెక్కి కూర్చున్న పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త దిగివచ్చాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశాయి.
పెట్రోల్ పై రూ. 2, డీజిల్ పై కూడా రూ.2 తగ్గించినట్లు పేర్కొన్నాయి. కొత్త ధరలు బుధవారం అర్ధరాత్రి నుంచి అమలుకానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు బ్యారెల్ ధరలు తగ్గుముఖం పట్టడమే తగ్గింపునకు కారణంగా తెలుస్తున్నది.
ప్రస్తుతం హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ. 75.11 గా ఉండగా, తగ్గిన ధరల ప్రకారం గురువారం నుంచి రూ.73.11 కే లభించనుంది. అలాగే ప్రస్తుతం 56.79గా ఉన్న లీటర్ డీజిల్.. సవరించిన ధరల ప్రకారం 54.79 రూపాయలకే లభ్యంకానుంది.
కాగా, ఢిల్లీ రాష్ట్రంలో మాత్రం వ్యాట్ సవరింపుల్లో భాగంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై రూ.2.78, డీజిల్ పై రూ. 1.83 పెంపు విధించారు.