మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్‌పై రూ. 1.27, డీజీల్‌పై రూ.1.17 తగ్గింపు
న్యూఢిల్లీ: వరుసగా మూడోసారి పెట్రో ధరలు తగ్గాయి. పెట్రోల్‌పై లీటరుకు రూ. 1.27, డీజీల్‌పై రూ. 1.17 తగ్గింది. కొత్త ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమవుతున్న నేపథ్యంలో... జులై 15 నుంచి ఆగష్టు 15 కాలాన్ని తీసుకుంటే నెలరోజుల్లో పెట్రోల్ ధర రూ. 5.69, డీజీల్‌పై రూ. 6.77ను చమురు కంపెనీలు తగ్గించాయి. ప్రతి పదిహేను రోజులకోసారి చమురు కంపెనీలు పెట్రో ధరలను సమీక్షించే విషయం తెలిసిందే.
ప్రస్తుతం హైదరాబాద్ లో రూ. 69.82గా ఉన్న ఒక లీటరు పెట్రోల్ ధర శుక్రవారం అర్ధరాత్రి నుంచి రూ. 68.55కు లభించనున్నది. అలాగే రూ.50.27గా ఉన్న ఒక లీటరు డీజిల్ ధర రూ. 49.10కు తగ్గింది.