desile
-
గుడ్‌న్యూస్: పెట్రోల్, డీజిల్‌పై భారం లేనట్లే
న్యూఢిల్లీ : లీటర్ పెట్రోల్‌పై రూ.2.5, లీటర్ డీజిల్‌పై రూ.4 చొప్పున అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్(ఏఐడీసీ) విధిస్తున్నట్లు 2021–22 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల రవాణా వ్యయం పెరిగి, నిత్యావసరాల ధరలు మండిపోతాయన్న ఆందోళనలు వ్యక్తమైనప్పటికీ వాస్తవానికి ప్రజలపై ఈ భారం ఉండదు. ఎందుకంటే పెట్రోల్, డీజిల్‌పై బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ(బీఈడీ), స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఏఈడీ)ని ప్రభుత్వం తగ్గించింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై బీఈడీ రూ.2.98 ఉండగా, దీన్ని రూ.1.4కు తగ్గించారు. అలాగే ఎస్ఏఈడీని రూ.12 నుంచి రూ.11కు కుదించారు. అలాగే లీడర్ డీజిల్‌పై బీఈడీని రూ.4.83 నుంచి రూ.1.8కు, ఎస్ఏఈడీని రూ.9 నుంచి రూ.8కి తగ్గించివేశారు. మొత్తంగా ఎక్సైజ్ పన్ను (బీఈడీ+ఎస్ఏఈడీ+ఏఐడీసీ) లీటర్ పెట్రోల్‌పై రూ.14.9, లీటర్ డీజిల్‌పై రూ.13.8 కానుంది. ఇప్పటివరకు ఇది వరుసగా రూ.14.98, రూ.13.83గా ఉంది. అంటే కొత్తగా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ విధించినా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు ఉండదు. వినియోగదారులపై అదనపు భారం పడబోదు. మద్యం ధరల్లోనూ మార్పు లేదు పెట్రోల్ డీజిల్ తరహాలోనే ఇంపోర్టెడ్ మద్యంపై 100 శాతం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్(ఏఐడీసీ) విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో ప్రకటించింది. 80 కంటే తక్కువ ఆల్కహాల్ శాతం ఉన్న దిగుమతి చేసుకున్న స్పిరిట్స్, వైన్స్‌పై ప్రస్తుతం 150 శాతం కస్టమ్స్ డ్యూటీ విధిస్తున్నారు. దీన్ని రూ.50 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మద్యంపై కస్టమ్స్ డ్యూటీ, ఏఐడీసీ కలిపి 150 శాతం కానుంది. అంటే దిగుమతి చేసుకున్న మద్యంపై ఏఐడీసీ విధించినప్పటికీ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. -
ఏడాది గరిష్టానికి పెట్రోల్
న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరలు వరుసగా ఏడో రోజూ ఎగబాకాయి. సోమవారం లీటరుపై పెట్రోల్ 29 పైసలు, డీజిల్ 19 పైసలు పెరిగింది. దీంతో వారం రోజుల్లో లీటరుపై పెట్రోల్ రూ.1.88, డీజిల్ రూ.1.50 పెరిగినట్లయింది. 2018 నవంబర్ తర్వాత పెట్రో ధరలు గరిష్టానికి చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటరుపై పెట్రోల్ రూ.74, డీజిల్ రూ.69కి చేరుకుంది. పెట్రోల్ ధర ఈ ఏడాది ఇదే గరిష్టం కాగా, ఇటీవలి కాలంలో డీజిల్ ధర ఇదే అత్యధికం. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం పెట్రోల్, డీజిల్‌పై పడింది. -
పెట్రో ధరలు తగ్గించకుంటే గద్దె దించుతాం: చాడ
సాక్షి, హైదరాబాద్: పెట్రో ల్, డీజిల్ ధరలు తగ్గించకుంటే గద్దె దించుతామని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ సోమవారం చేపట్టిన దేశవ్యాప్త బంద్ లో భాగంగా సీపీఎం, న్యూడెమోక్రసీ, ఆర్ఎస్పీ, ఎస్‌యూసీఐ, సీపీఐఎంఎల్ నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. బస్‌భవన్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. చాడ మాట్లాడుతూ.. కేంద్రం అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేద ప్రజలపై పెనుభారాన్ని మోపుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలన్నా రు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు, ఎస్‌యూసీఐ రాష్ట్ర కార్యదర్శి మురహరి, సీపీఐ ఎంఎల్ రాష్ట్ర నాయ కుడు భూతం వీరన్న తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
పెట్రోల్‌పై 83 పైసలు, డీజిల్‌పై రూ.1.26 న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై లీటరుకు 83 పైసలు, డీజిల్‌పై రూ.1.26 పెరిగింది. పెంచిన ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) వెల్లడించింది. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.63.02కు, డీజిల్ ధర రూ.51.67కు పెరిగింది. ఈ నెలలో ఇదో రెండో పెంపు. మే 1న పెట్రోల్‌పై రూ.1.06, డీజిల్‌పై రూ.2.94 పెరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల పెంపు, రూపాయి- డాలర్ మారకపు విలువ పెంపుతో పెట్రో ధరలను పెంచినట్లు ఐఓసీ తెలిపింది. -
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: వాహనదారులకు స్వల్ప ఊరట. దేశవ్యాప్తంగా పెట్రోల్, డిజల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. పెల్రోల్ పై 32 పైసలు, డిజిల్ పై 85 పైసలు తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు శుక్రవారం వెల్లడించాయి. కొత్త ధరలు ఈ అర్ధరాత్రి నుంచే అమలవుతాయని పేర్కొన్నాయి. గడిచిన రెండు నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గటం ఇది రెండోసారి. -
మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
-
మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్‌పై రూ. 1.27, డీజీల్‌పై రూ.1.17 తగ్గింపు న్యూఢిల్లీ: వరుసగా మూడోసారి పెట్రో ధరలు తగ్గాయి. పెట్రోల్‌పై లీటరుకు రూ. 1.27, డీజీల్‌పై రూ. 1.17 తగ్గింది. కొత్త ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమవుతున్న నేపథ్యంలో... జులై 15 నుంచి ఆగష్టు 15 కాలాన్ని తీసుకుంటే నెలరోజుల్లో పెట్రోల్ ధర రూ. 5.69, డీజీల్‌పై రూ. 6.77ను చమురు కంపెనీలు తగ్గించాయి. ప్రతి పదిహేను రోజులకోసారి చమురు కంపెనీలు పెట్రో ధరలను సమీక్షించే విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో రూ. 69.82గా ఉన్న ఒక లీటరు పెట్రోల్ ధర శుక్రవారం అర్ధరాత్రి నుంచి రూ. 68.55కు లభించనున్నది. అలాగే రూ.50.27గా ఉన్న ఒక లీటరు డీజిల్ ధర రూ. 49.10కు తగ్గింది. -
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
-
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్‌పై రూ. 2.43 డీజిల్‌పై రూ. 3.60 తగ్గింపు న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో చమురు కంపెనీలు వరుసగా రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాయి. పెట్రోల్‌పై రూ.2.43 పైసలు తగ్గగా, డీజిల్ ఏకంగా రూ.3.60 పైసలు తగ్గింది. ఈ తగ్గింపు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చింది. చివరిసారి జూలై 16న పెట్రోల్, డీజిల్‌లపై రెండేసి రూపాయల చొప్పున చమురు కంపెనీలు తగ్గించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం చమురు ధరలపై నియంత్రణ ఎత్తేయడంతో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి... ప్రతినెలా ఒకటో తేదీ, 16వ తేదీ చమురు కంపెనీలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్నాయి. కాగా సబ్సీడీయేతర సిలిండర్ ధర (14.2 కేజీలు) కూడా రూ.23.50 తగ్గింది. -
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: కొద్దిరోజులుగా కొండెక్కి కూర్చున్న పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త దిగివచ్చాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశాయి. పెట్రోల్ పై రూ. 2, డీజిల్ పై కూడా రూ.2 తగ్గించినట్లు పేర్కొన్నాయి. కొత్త ధరలు బుధవారం అర్ధరాత్రి నుంచి అమలుకానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు బ్యారెల్ ధరలు తగ్గుముఖం పట్టడమే తగ్గింపునకు కారణంగా తెలుస్తున్నది. ప్రస్తుతం హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ. 75.11 గా ఉండగా, తగ్గిన ధరల ప్రకారం గురువారం నుంచి రూ.73.11 కే లభించనుంది. అలాగే ప్రస్తుతం 56.79గా ఉన్న లీటర్ డీజిల్.. సవరించిన ధరల ప్రకారం 54.79 రూపాయలకే లభ్యంకానుంది. కాగా, ఢిల్లీ రాష్ట్రంలో మాత్రం వ్యాట్ సవరింపుల్లో భాగంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై రూ.2.78, డీజిల్ పై రూ. 1.83 పెంపు విధించారు. -
డీజిల్ కోసం బిందెలు, బకెట్లతో పరుగులు..
జి.కొండూరు: ఆదివారం మద్యాహ్నం.. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం.. బిందెలు, బకెట్లు, కుండలు.. ఇలా ఏదిదొరికితే దాన్ని తీసుకుని జనం పరుగులు పెట్టారు. ఎండాకాలం కదా అగ్నిప్రమాదమేదైనా సంభవించిదా.. మంటలు ఆర్పేందుకే వీళ్లు వెళుతున్నారా? అని చూసేవాళ్లు సందేహపడ్డారు. అసలు విషయమేమంటే.. కట్టుబడిపాలెం గ్రామంలోని హెచ్‌పీసీఎల్ కంపెనీకి చెందిన పైపులైన్లు లీకై వాటినుంచి డీజిల్ అంతెత్తున ఎగిసిపడింది. అసలే డీజిల్ రేట్లు మండిపోతున్న తరుణంలో దానిని తెచ్చుకునేందుకు జనం ఇలా పరుగులు పెట్టారు. హెపీసీఎల్ కంపెనీ స్టోరేజీ ట్యాంకర్ల సమీపంలో పైపులైన్ నుంచి భూమిపైకి డీజిల్ చొచ్చుకొచ్చి సమీప డ్రైనీజీలో కలిసినట్టు గుర్తించిన కొందరు తమవారికి సమాచారం ఇవ్వడంతో ఈ పరుగుల ప్రహాసనం మొదలైంది. చివరికి అధికారులు చేరుకుని మరమ్మతులు చేసి ఆయిల్ లీకేజీని నియంత్రించారు. పైపులైన్ అడుగు భాగంలో దెబ్బతినడం వల్లే లీకేజీ చోటు చేసుకుందని చెప్పారు. ఇదే ప్రాంతంలో గతంలో రెండు సార్లు లీకేజీలు చోటు చేసుకున్నాయి.