
సాక్షి, హైదరాబాద్: పెట్రో ల్, డీజిల్ ధరలు తగ్గించకుంటే గద్దె దించుతామని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ సోమవారం చేపట్టిన దేశవ్యాప్త బంద్ లో భాగంగా సీపీఎం, న్యూడెమోక్రసీ, ఆర్‌ఎస్పీ, ఎస్‌యూసీఐ, సీపీఐఎంఎల్ నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.
బస్‌భవన్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. చాడ మాట్లాడుతూ.. కేంద్రం అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేద ప్రజలపై పెనుభారాన్ని మోపుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలన్నా రు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, ఆర్‌ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు, ఎస్‌యూసీఐ రాష్ట్ర కార్యదర్శి మురహరి, సీపీఐ ఎంఎల్ రాష్ట్ర నాయ కుడు భూతం వీరన్న తదితరులు పాల్గొన్నారు.