తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్‌పై రూ. 2.43 డీజిల్‌పై రూ. 3.60 తగ్గింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో చమురు కంపెనీలు వరుసగా రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాయి. పెట్రోల్‌పై రూ.2.43 పైసలు తగ్గగా, డీజిల్ ఏకంగా రూ.3.60 పైసలు తగ్గింది. ఈ తగ్గింపు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చింది. చివరిసారి జూలై 16న పెట్రోల్, డీజిల్‌లపై రెండేసి రూపాయల చొప్పున చమురు కంపెనీలు తగ్గించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం చమురు ధరలపై నియంత్రణ ఎత్తేయడంతో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి... ప్రతినెలా ఒకటో తేదీ, 16వ తేదీ చమురు కంపెనీలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్నాయి. కాగా సబ్సీడీయేతర సిలిండర్ ధర (14.2 కేజీలు) కూడా రూ.23.50 తగ్గింది.