మరింత వేడెక్కనున్న తెలంగాణ
హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశమున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం మహబూబ్‌నగర్, అదిలాబాద్, భద్రాచలం జిల్లాల్లో అత్యధికంగా 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. నిజామాబాద్, హైదరాబాద్, అదిలాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో మరో మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.