అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో శనివారం అగళిలో 11.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మడకశిర 12 డిగ్రీలు, రొద్దం 12.6 , సోమందేపల్లి 12.7 , లేపాక్షి 12.9 డిగ్రీలు నమోదు కాగా మిగిలిన మండలాల్లో 13 నుంచి 18 డిగ్రీలు నమోదైంది. పామిడిలో 36.2 డిగ్రీలు గరిష్టం నమోదైనా మిగతా మండలాల్లో 30 నుంచి 34 డిగ్రీల మధ్య కొనసాగింది. గాలిలో తేమ శాతం ఉదయం 65 నుంచి 80, మధ్యాహ్నం 22 నుంచి 32 శాతం మధ్య రికార్డయింది. గాలివేగం స్వల్పంగా పెరిగి 8 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో వీచాయి.