గత నాలుగైదు రోజులుగా జిల్లాలో పగలూ, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.
– అగళి 9.4 డిగ్రీలు, తనకల్లు 9.8 డిగ్రీలు కనిష్టం
అనంతపురం అగ్రికల్చర్ : గత నాలుగైదు రోజులుగా జిల్లాలో పగలూ, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. చాలా మండలాల్లో చలి తీవ్రత ఇంకా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్న సమయంలో ఎండలు కనిపిస్తున్నాయి. శుక్రవారం నమోదైన వివరాల ప్రకారం అగళి 9.4 డిగ్రీలు, తనకల్లు 9.8 డిగ్రీల కనిష్టం నమోదు కాగా మడకశిర 10.3 డిగ్రీలు, రొద్దం 11.8 డిగ్రీలు, నల్లమాడ 12.5 డిగ్రీలు, కనగానపల్లి, చిలమత్తూరు 12.6 డిగ్రీలు, హిందూపురం, గాండ్లపెంట, ఎన్‌పీ కుంట 12.7 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా మండలాల్లో 13 నుంచి 18 డిగ్రీల వరకు కొనసాగింది.
పామిడిలో 36.7 డిగ్రీలు గరిష్టం నమోదు కాగా తక్కిన మండలాల్లో 30 నుంచి 34 డిగ్రీల మధ్య నమోదైంది. గాలిలో తేమశాతం ఉదయం 55 నుంచి 80, మధ్యాహ్నం 20 నుంచి 30 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 7 నుంచి 14 కిలో మీటర్ల వేగంతో వీచాయి. కొన్ని మండలాల్లో గాలివేగం అధికంగా ఉంది. రాగల నాలుగు రోజుల్లో 33 నుంచి 34 డిగ్రీల గరిష్టం, 17 నుంచి 18 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావచ్చని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా విభాగం శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి తెలిపారు.