జిల్లాలో ఓ వైపు కనిష్టం, మరో వైపు గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. దీంతో చలితో పాటు ఎండతీవ్రత క్రమంగా పెరుగుతోంది.
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో ఓ వైపు కనిష్టం, మరో వైపు గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. దీంతో చలితో పాటు ఎండతీవ్రత క్రమంగా పెరుగుతోంది. శనివారం తనకల్లులో 9.3 డిగ్రీలు కనిష్టం నమోదు కాగా అగళి 10 డిగ్రీలు, మడకశిర 10.2 డిగ్రీలు, తలుపుల 11.7 డిగ్రీలు, రొద్దం 12 డిగ్రీలు, అమరాపురం 12.2 డిగ్రీలు, లేపాక్షి 12.5 డిగ్రీలు, కనగానపల్లి 12.9 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో 13 నుంచి 18 డిగ్రీల వరకు కొనసాగాయి.
ఎన్పీ కుంటలో 39.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా పామిడి 37.7 డిగ్రీలు, పుట్టపర్తి 37 డిగ్రీలు మిగతా మండలాల్లో 32 నుంచి 36 డిగ్రీల వరకు నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 50 నుంచి 80, మధ్యాహ్న సమయంలో 10 నుంచి 20 శాతం మధ్య రికార్డయింది. గంటకు 7 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.