► హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వడగాడ్పుల నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రోహిణీ కార్తె దగ్గర పడుతుండటంతో ఎండలు మండిపోతున్నాయి.
శుక్రవారం నల్లగొండ, రామగుండంలలో 46 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు అన్నిచోట్లా 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే ఐదు డిగ్రీలు ఎక్కువగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండలోనూ సాధారణం కంటే 4.8 డిగ్రీలు ఎక్కువగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.