చీర కట్టిన దానిమ్మతోట
దానిమ్మ తోట ఏమిటి..చీరకట్టడమేమిటి అనుకుంటున్నారా..నిజమేనండి..కల్లూరు మండలం పెద్దటేకూరు గ్రామ శివారులో జాతీయ రహదారికి పక్కన చీరకట్టిన దానిమ్మ తోట కనిపిస్తుంది. నాణ్యమైన దిగుబడి కోసం ఇలా చేస్తున్నట్లు రైతు మహేశ్వరరెడ్డి చెబుతుఆన్నరు. తాను 40 ఎకరాల్లో దానిమ్మ తోటను ఐదేళ్ల నుంచి సాగుచేస్తున్నట్లు చెప్పారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో కాయలు దెబ్బతినకుండా 20 ఎకరాల్లో చెట్ల పై భాగంలో చీరలు కప్పినట్లు తెలిపారు. ఇందుకు 10 వేల చీరలు అవసరమయ్యాయని, రూ 1. 20 లక్షలు ఖర్చు అయిందని చెప్పారు. మరో 20 ఎకరాల్లో 15 క్వింటాళ్ల పేపర్‌ను కొనుగోలు కాయలు చుట్టూ వాటిని కట్టినట్లు వివరించారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే కాయపై నల్లటి మచ్చలు ఏర్పడి... దాని ద్వారా కాయలోకి వైరస్ ప్రవేశిస్తుందన్నారు. గింజలు నల్లగా మారి కాయ పాడవుతుందన్నారు. లాభాలు రాకపోయినా పెట్టుబడి అయినా చేతికి వస్తుందనే ఆశతో చీరలతో నీడ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
- కల్లూరు