అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో వేసవి సెగ మొదలైంది. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్న సమయంలో ఎండ వేడి, ఉక్కపోత పెరిగింది. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల మార్క్ నమోదవుతోంది. బుధవారం తాడిమర్రి, యాడికి మండలాల్లో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా... చెన్నేకొత్తపల్లి 40.9 డిగ్రీలు, శింగనమల 40.7, పామిడి 40.7, ఆత్మకూరు 40.5, యల్లనూరు 40.2, తాడిపత్రి 39.9, పుట్లూరు 39.8, పుట్టపర్తి 39.2, గుంతకల్లు 39.1, కదిరి 39.1, గుత్తి 38.9, ధర్మవరం 38.8, అనంతపురం, కళ్యాణదుర్గం 38 డిగ్రీలు, పెనుకొండ 37.9, హిందూపురం 35.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 15 నుంచి 22 డిగ్రీల వరకు నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం ఉదయం 56 నుంచి 82 వరకు, మధ్యాహ్నం 12 నుంచి 20 వరకు ఉంది. గాలులు గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచాయి.