అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో ఎండలు అంతకంతకూ ఎక్కువవుతున్నాయి. గాలివేగం కూడా పెరగడంలో వడగాల్పులు జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సీజన్‌లో తొలిసారిగా ఎన్‌పీ కుంట మండలంలో సోమవారం 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 42 మండలాల్లో 40 డిగ్రీల నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో వేసవితాపం తారాస్థాయికి చేరుకుంది.
ఎన్‌పీ కుంటలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా పామిడి 43.4 డిగ్రీలు, శింగనమల 42.8 డిగ్రీలు, యల్లనూరు 42.2 డిగ్రీలు, బుక్కరాయసముద్రం 42 డిగ్రీలు, పుట్లూరు 41.6 డిగ్రీలు, కూడేరు 41.5 డిగ్రీలు, కొత్తచెరువు 41.2 డిగ్రీలు, కనగానపల్లి 41.2 డిగ్రీలు, పెద్దవడుగూరు 41.2 డిగ్రీలు, తాడిమర్రి 41.1 డిగ్రీలు, కంబదూరు 41 డిగ్రీలు, తనకల్లు 41 డిగ్రీలు, గార్లదిన్నె, గుత్తి, గుంతకల్లు, గుడిబండ, కనేకల్లు, పుట్టపర్తి, చెన్నేకొత్తపల్లి, రామగిరి, ధర్మవరం, బత్తలపల్లి, రాయదుర్గం, కళ్యాణదుర్గం,నార్పల, కదిరి తదితర మండలాల్లో 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా మండలాల్లో 38, 39 డిగ్రీలు ఉండగా కనిష్ట ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.
గాలిలో తేమశాతం ఉదయం 44 నుంచి 74, మధ్యాహ్నం 13 నుంచి 23 శాతం మధ్య రికార్డయింది. గంటకు 6 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. రాప్తాడు, బత్తలపల్లి, ఆత్మకూరు, కనేకల్లు, పుట్లూరు, పామిడి, బొమ్మనహాల్, పెద్దవడుగూరు, తనకల్లు, ధర్మవరం, అమడగూరు, నల్లచెరువు, గోరంట్ల, ఓడీ చెరువు, అమరాపురం తదితర మండలాల్లో గాలివేగం ఎక్కువగా ఉండటంతో వేసవిగాలులు జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి.
మండే ఎండలు
Published Tue, Mar 28 2017 1:14 AM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM
Advertisement