ఎండ వేడిమికి దేశంలోని పలు ప్రాంతాల్లోని జనం ఉక్కపోతతో చెమటలు చిందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏసీలు, కూలర్లు జనానికి ఉపశమనం కల్పిస్తున్నాయి. అయితే బయటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలు లేదా దానికిమించినప్పుడు ఏసీలు, కూలర్లు అందించే చల్లదనం ఎవరికీ ఏమాత్రం సరిపోవడం లేదు.
ఎయిర్ కండీషనర్‌లో 16 డిగ్రీల కంటే తక్కువ, 30 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను సెట్ చేయలేం. ఏసీలోని కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా, ఒకే మాదిరిగా ఉంటాయి. అయితే దీనికి కారణం ఏంటి?
ఏసీ రిమోట్‌లో ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉండదనే సంగతి మనకు తెలిసిందే. ఏ బ్రాండ్ ఏసీలోనైనా కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే తక్కువకు ఉండదు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది ఏసీ మరమ్మతుకు గురికావడం. రెండోది వినియోగదారుల ఆరోగ్యానికి హానికరంగా పరిణమించడం.
అన్ని ఎయిర్ కండీషనర్లలో ఇవాపొరేటర్ ఉంటుంది. ఇది శీతలకరణి సహాయంతో గదిని చల్లబరుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఏసీ ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే ఆ ఇవాపొరేటర్‌లో మంచు పేరుకుపోతుంది. దీంతో అది త్వరగా మరమ్మతుకు గురవుతుంది. అలాగే వినియోగదారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే ఏ ఏసీలోనైనా ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే తక్కువ ఉండదు.
ఇక ఏసీలోని గరిష్ట ఉష్ణోగ్రత విషయానికొస్తే అది 30 డిగ్రీలకు మించి ఉండదు. సాధారణంగా ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నప్పుడు మనకు ఏమాత్రం ఇబ్బందిగా అనిపించదు. అయితే ఉష్ణోగ్రత అంతకు మించినప్పుడు ఉక్కపోతకు గురవుతాం. అలాగే ఏసీ ఉష్ణోగ్రతను 30 కంటే ఎక్కువగా ఉంచడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే 30 డిగ్రీలకు మించి ఏసీ ఉంటే దాని నుంచి వేడి గాలి వీస్తుంది. నిజానికి ఎయిర్ కండీషనర్ పని గాలిని చల్లబరచడం. వేడి చేయడం కాదు.
Comments
Please login to add a commentAdd a comment