కొన్ని మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలతో చలివాతావరణం కొనసాగుతుండగా మరికొన్ని మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
అనంతపురం అగ్రికల్చర్ : కొన్ని మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలతో చలివాతావరణం కొనసాగుతుండగా మరికొన్ని మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శుక్రవారం అగళిలో 11.7 డిగ్రీలు కనిష్టం నమోదు కాగా... మడకశిర 12.4 డిగ్రీలు, తనకల్లు 12.7 డిగ్రీలు, రొద్దం 13.4 డిగ్రీలు, అమడగూరు 13.8 డిగ్రీలు, ఎన్‌పీ కుంట, గాండ్లపెంట, సోమందేపల్లి 13.9 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో 14 నుంచి 19 డిగ్రీల వరు కొనసాగాయి. పగటి ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీలు నమోదయ్యాయి.