అనంతపురం అగ్రికల్చర్ : గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జిల్లా అంతటా వేసవితాపం కొనసాగుతోంది. శనివారం చెన్నేకొత్తపల్లిలో 40.3 డిగ్రీలు గరిష్టం నమోదు కాగా పామిడి 39.8 డిగ్రీలు, పుట్టపర్తి 39.4 డిగ్రీలు, రాయదుర్గం 39.3 డిగ్రీలు, శింగనమల 39.2 డిగ్రీలు నమోదైంది. మిగతా మండలాల్లో 36 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 17 నుంచి 23 డిగ్రీలకు చేరుకున్నాయి. గాలిలో తేమశాతం ఉదయం 65 నుంచి 80, మధ్యాహ్నం 12 నుంచి 22 శాతం మధ్య రికార్డయింది.