chennekothapalli
-
YSR Uchitha Pantala Bheema Scheme: రైతుకు అండగా.. సీఎం వైఎస్ జగన్ పవర్ ఫుల్ స్పీచ్
-
YSR Free Crop Insurance: 15.61 లక్షల మంది ఖాతాల్లోకి రూ. 2997.82 కోట్ల బీమా జమ
-
వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా గురించి సీఎం వైఎస్ జగన్ ప్రసంగం
-
ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది సరికొత్త రికార్డ్: మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
-
రైతు స్పీచ్ కు ఫిదా.. సెల్ఫీ దిగిన సీఎం జగన్
-
వ్యవసాయం గురించి కలెక్టర్ అద్భుతమైన స్పీచ్
-
వైఎస్ జగన్ నాయకత్వంలో ఇళ్ల ముగింటకే సంక్షేమం: తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
-
Sri Satyasai Dist: సీఎం వైఎస్ జగన్ గ్రాండ్ ఎంట్రీ
-
Sri SathyaSai District: చెన్నేకొత్తపల్లికి సీఎం జగన్
చెన్నేకొత్తపల్లి (శ్రీసత్యసాయి జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 14వ తేదీన శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లికి రానున్నారు. ఇక్కడ నిర్వహించే బహిరంగ సభ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు పంట బీమా సొమ్మును కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సీఎం ప్రోగాం కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ బసంత్‌కుమార్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ఎస్పీలు ఫక్కీరప్ప, రాహుల్‌దేవ్ సింగ్ చెన్నేకొత్తపల్లిలో పర్యటించారు. సీఎం సభాస్థలి, హెలీప్యాడ్ కోసం పలు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో తలశిల రఘురాం, కలెక్టర్ బసంత్‌కుమార్ అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. సభ కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు గోవిందరెడ్డి, ఎంపీపీ శ్రీశైలం ప్రవీణ తదితరులు ఉన్నారు. చదవండి: (12న కావలికి సీఎం వైఎస్ జగన్ రాక?) -
మద్యం షాపులో పనిచేస్తా.. నిషేధానికి కృషి చేస్తా
సాక్షి, చెన్నేకొత్తపల్లి: అనంతపురం జిల్లా చెన్నే కొత్తపల్లి మండలం వెంకటంపల్లికి చెందిన ఈమె పేరు వన్నా స్వప్న. ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేశారు. తానూ ప్రభుత్వ మద్యం దుకాణంలో పని చేస్తానంటూ సూపర్వైజర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. భర్త వ్యవసాయం చేస్తుండగా.. ఆ దంపతులకు నాలుగేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన స్వప్నను.. మహిళగా ఈ ఉద్యోగం ఎలా చేయగలరని పలువురు ప్రశ్నించారు. ఆమె సమాధానమిస్తూ.. ‘నా భర్త మల్లికార్జునరెడ్డి సహకారంతోనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేశా. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. స్వచ్ఛమైన మనసుండాలే కానీ.. ఏ ఉద్యోగమైతే ఏంటి. నాకు ఈ ఉద్యోగమొస్తే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తా. మద్యం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తా’ అని చెప్పింది. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు సూపర్వైజర్స్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సేల్స్‌మెన్ ఉద్యోగ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించినట్టు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ తెలిపారు. తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, ఎక్సైజ్ అధికారులు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కమిటీలో సభ్యులుగా ఉన్నారని వెల్లడించారు. జిల్లాలో 198 సూపర్వైజర్ పోస్టులకు 5019 మంది, 495 సేల్స్‌మెన్ పోస్టులకు 4208 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. ఇందులో వికలాంగులు సూపర్వైజర్ ఉద్యోగాలకు 165 మంది, సేల్స్‌మెన్ ఉద్యోగాలకు 111 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరికి 1శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. గైర్హాజరైన వారిని అనర్హులుగా ప్రకటిస్తామన్నారు. 13న ఇంటర్వ్యూలు ప్రభుత్వ మద్యం దుకాణాల ఉద్యోగాలకు (సూపర్వైజర్స్, సేల్స్‌మెన్) సంబంధించి ఈనెల 13న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని జాయింట్ కలెక్టర్ ఎస్. డిల్లీరావు తెలిపారు. ఇంటర్వ్యూలు ఉదయం 9 గంటల నుంచి కదిరి, కళ్యాణదుర్గం, అనంతపురం, పెనుకొండ, ధర్మవరం రెవెన్యూ డివిజినల్ అధికారి(ఆర్డీఓ) కార్యాలయాల్లో నిర్వహిస్తామని చెప్పారు. ముందుగా సూపర్వైజర్ పోస్టులకు, అనంతరం సేల్స్‌మెన్ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. ఆయా డివిజన్ల పరిధిలోని అభ్యర్థులు సంబంధిత ఆర్డీఓ అధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూకు హాజరవ్వాలని సూచించారు. ఇంటర్వ్యూ బోర్డులో ఆర్డీఓ చైర్మన్‌గా, కో–ఆపరేటివ్, ఎక్సైజ్ అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సిన అభ్యర్థుల సెల్‌కు సంక్షిప్తం సందేశం పంపుతామని పేర్కొన్నారు. -
అమ్మో.. ఇంత డబ్బా!
సాక్షి, అనంతపురం: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో భారీ మొత్తంలో డబ్బు కట్టలు బయటపడటంతో కలకలం రేగింది. ఇంత డబ్బును ఎక్కడికి తరలిస్తున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి వద్ద పోలీసుల తనిఖీల్లో 1.27 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. డబ్బు తరలిస్తున్నవారు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో చెన్నేకొత్తపల్లి వీఆర్వో నజీర్ సహా ఐదుగుర్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నగదు తీసుకెళ్తున్నామని చెబుతూనే పొంతనలేని సమాధానాలతో చెప్పటంతో పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఇన్నోవా కారు తెలంగాణ రిజిస్ట్రేషన్ (టీఎస్ 07 ఏటీ 0408)తో కొత్త ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసలు ఈ డబ్బు ఎవరిది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సివుంది. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంత డబ్బు పట్టుబడటం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఎరువులో బోరు మట్టి !
చెన్నేకొత్తపల్లి : మండల వ్యాప్తంగా కల్తీ ఎరువులు హల్చల్ చేస్తున్నాయి. ఎరువులో బోరు మట్టిని కలిపి విక్రయిస్తుండడంతో రైతులు గుర్తించలేకపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన రైతు సూరి గోరు చిక్కుడు సాగు చేశారు. 15 రోజుల క్రితం ధర్మవరంలోని ఓ ఎరువుల దుకాణం నుంచి 17-17-17 రకం కాంప్లెక్స్ ఎరువును కొనుగోలు చేశారు. డ్రిప్ ద్వారా పంటకు అందజేసేందుకు రెండు కిలోల ఎరువును బకెట్ నీటిలో కలిపితే బకెట్ అడుగున బోరు మట్టి పేరుకుపోయి కనిపించింది. దీంతో మరికొందరు రైతులను ఆయన విచారణ చేయగా మరికొందరికి ఇలాంటి అనుభవమే ఎదురైనట్లు తెలిసింది. అధికారులు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. -
చెన్నేకొత్తపల్లిలో భగభగ
అనంతపురం అగ్రికల్చర్ : గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జిల్లా అంతటా వేసవితాపం కొనసాగుతోంది. శనివారం చెన్నేకొత్తపల్లిలో 40.3 డిగ్రీలు గరిష్టం నమోదు కాగా పామిడి 39.8 డిగ్రీలు, పుట్టపర్తి 39.4 డిగ్రీలు, రాయదుర్గం 39.3 డిగ్రీలు, శింగనమల 39.2 డిగ్రీలు నమోదైంది. మిగతా మండలాల్లో 36 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 17 నుంచి 23 డిగ్రీలకు చేరుకున్నాయి. గాలిలో తేమశాతం ఉదయం 65 నుంచి 80, మధ్యాహ్నం 12 నుంచి 22 శాతం మధ్య రికార్డయింది. -
హైవేపై కారు బీభత్సం
చెన్నెకొత్తపల్లి (అనంతపురం) : రోడ్డు దాటుతున్న మహిళను తప్పించడానికి ప్రయత్నించిన కారు అదుపుతప్పి మందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న మహిళతోపాటు కారులో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా చెన్నెకొత్తపల్లి మండలం ఎర్రంపల్లి సమీపంలోని 44 జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగింది. చెన్నెకొత్తపల్లి నుంచి అనంతపురం వెళ్తున్న సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు చెందిన కారు ఎర్రంపల్లి సమీపంలోకి రాగానే గ్రామానికి చెందిన మహిళ రోడ్డు దాటుతుంది. ఆమెను తప్పించడానికి ప్రయత్నించడంతో.. కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరితోపాటు రోడ్డు దాటుతున్న మహిళకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.