అనంతపురం అగ్రికల్చర్ : భానుడు రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతున్నాడు. శనివారం పామిడి మండల కేంద్రంలో 43.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రతకు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇళ్లలోనూ ఉక్కపోత తప్పలేదు. అలాగే శింగనమల మండలం తరిమెలలో 42.4 డిగ్రీలు, యల్లనూరు 41.8, కనగానపల్లి 41.8, చెన్నేకొత్తపల్లి 41.4, పుట్లూరు 41.3, పుట్టపర్తి 41.2, తాడిమర్రి 41, యాడికి 40.8, కదిరి 40.7, గుత్తి 40.4, గుంతకల్లు 40, అనంతపురం 39.4, ధర్మవరంలో 39.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా మండలాల్లో 37 నుంచి 39 డిగ్రీల మధ్య కొనసాగింది.