శనివారం పామిడిలో 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
అనంతపురం అగ్రికల్చర్ : శనివారం పామిడిలో 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శింగనమల 40.3 డిగ్రీలు, గుంతకల్లు, తాడిమర్రిలో 39.7 డిగ్రీలు, యల్లనూరు 39.4 డిగ్రీలు, పుట్లూరు, విడపనకల్ 39.3 డిగ్రీలు, బుక్కరాయసముద్రం 39.2 డిగ్రీలు, కనగానపల్లి 39.1 డిగ్రీ నమోదు కాగా మిగతా మండలాల్లో 36 నుంచి 39 డిగ్రీల వరకు కొనసాగాయి.
కనిష్ట ఉష్ణోగ్రతలు 17 నుంచి 22 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 58 నుంచి 78, మధ్యాహ్న సమయంలో 12 నుంచి 22 శాతం మధ్య రికార్డయింది. గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. మొత్తంమ్మీద జిల్లా అంతటా వేసవి తీవ్రత కొనసాగుతుండటంతో జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.