ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో ఎండలు మండుతున్నాయి.
అనంతపురం అగ్రికల్చర్ : ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో ఎండలు మండుతున్నాయి. శుక్రవారం ఎన్‌పీ కుంట మండలంలో 42.2 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదైంది. పామిడి 41.6 డిగ్రీలు, యల్లనూరు 40.4 డిగ్రీలు, గుంతకల్లు 40.3 డిగ్రీలు, తనకల్లు 40.2 డిగ్రీలు ఉండగా మిగతా మండలాల్లో 36 నుంచి 40 డిగ్రీల వరు కొనసాగింది. జిల్లా అంతటా కనిష్ట ఉష్ణోగ్రత 17 నుంచి 22 డిగ్రీల మధ్య నమోదయ్యింది.
గాలిలో తేమ శాతం తగ్గిపోతోంది. ఉదయం పూట 50 నుంచి 75 శాతం ఉండగా మధ్యాహ్న సమయానికి 12 నుంచి 20 శాతం మధ్య పరిమితమైంది. గాలివేగం కొంత పెరగడంతో 7 నుంచి 14 కిలో మీటర్ల వేగంతో వీచాయి. ఫిబ్రవరిలోనే ఉదయం 10 గంటలకే ఉక్కపోత మొదలు కావడంతో జనం అప్పుడే ఇబ్బందులు పడుతున్నారు.