2100 నాటికి ముంబై ‘గరం గరం’
వాషింగ్టన్: ముంబై నగరం ఈ శతాబ్దిలో నిప్పుల కుంపటిలా మారనుంది! నగరంలో ప్రశాంత వాతావరణంతో కూడిన రోజుల(మైల్డ్ డే) సంఖ్య భారీగా తగ్గుతుందని, ఈ శతాబ్ది చివరికి పరిస్థితి మరింత దిగజారుతుందని ఓ అధ్యయనం పేర్కొంది. అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ ఆట్మాస్మెరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన్‌ఓఏఏ), ప్రిన్స్‌టన్ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలోని అంచనాల ప్రకారం ముంబైలో ప్రస్తుతం ఏడాదికి 82 ప్రశాంత దినాలున్నాయి. 2035 నాటికి వీటిలో 16 తగ్గుతాయి. 2100 నాటికి మరో 44(దాదాపు సగం) తగ్గుతాయి. 18 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, తక్కువ తేమ, అర అంగుళం కంటే తక్కువ వర్షపాతంతో కూడిన రోజులను శాస్త్రవేత్తలు ప్రశాంత దినాలుగా పరిగణిస్తారు.