- రాష్ట్రంలో పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరా బాద్: రాష్ట్రంలో పొడి వాతా వరణం నెలకొనడంతో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు తక్కువగా నమోదవు తున్నాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 13 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత రికార్డయింది.
ఖమ్మంలో సాధారణం కన్నా 3 డిగ్రీలు తక్కువగా 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండలో 2 డిగ్రీలు తక్కువగా 16 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆదిలాబాద్‌లో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత
Published Mon, Dec 19 2016 3:39 AM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM
Advertisement
Advertisement