వేసవి తాపం రోజురోజుకు అధికమవుతోంది. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు.
అనంతపురం అగ్రికల్చర్ : వేసవి తాపం రోజురోజుకు అధికమవుతోంది. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటలకే చెమటలు పట్టేలా ఎండలు కాస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు, శ్రామికుల పరిస్థితి దయనీయంగా తయారవుతోంది. మంగళవారం ఎన్‌పీ కుంట మండలంలో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. యల్లనూరు 41 డిగ్రీలు, తాడిమర్రి, చెన్నేకొత్తపల్లి, పెద్దవడుగూరు, పామిడి, పెద్దపప్పూరు, గుడిబండ మండలాల్లో 40 డిగ్రీలు, రాయదుర్గం, విడపనకల్, తాడిపత్రి, బత్తలపల్లి, బుక్కపట్టణం, ఉరవకొండ, పెనుకొండ, కనగానపల్లి, కళ్యాణదుర్గం, నల్లచెరువు, రొద్దం, ధర్మవరం, నల్లమాడ మండలావల్లో 39 డిగ్రీల మేర నమోదైంది.
మిగతా మండలాల్లో 36 డిగ్రీల నుంచి 38 నుంచి డిగ్రీలు కొనసాగింది. జిల్లా అంతటా కనిష్ట ఉష్ణోగ్రతలు 19 నుంచి 24 డిగ్రీల వరకు నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 55 నుంచి 75, మధ్యాహ్నం 22 నుంచి 32 శాతం మధ్య రికార్డయింది. గంటకు 7 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.