అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో వేసవి తాపం కొనసాగుతోంది. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదివారం ఎన్‌పీ కుంటలో 41.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, పామిడి 40.4 డిగ్రీలు, తనకల్లు 40.2 డిగ్రీలు నమోదైంది. మిగతా మండలాల్లో 36 నుంచి 40 డిగ్రీల మధ్య కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 17 నుంచి 22 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం ఉదయం 60 నుంచి 80, మధ్యాహ్నం 15 నుంచి 25 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచాయి.